ఎంత దారుణం : గర్భంతో వున్న ఆవు తలనరికి, కడుపుకోసి దూడను బయటకు తీసిన దుండగులు 

మానవత్వాన్ని మరిచిన కొందరు దుండగులు రెండు మూగజీవాలను పొట్టనపెట్టుకున్న ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. గోవును, దాని కడుపులోని దూడను అత్యంత పాశవికంగా హతమార్చారు. 

Pregnant cow Beheaded in Karnataka AKP

మానవత్వాన్ని మరిచిన కొందరు దుండగులు గర్భంతో వున్న గోవును అత్యంత పాశవికంగా హతమార్చిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఆవు కడుపును చీల్చి దూడను బయటకు తీసారు. ఆ తర్వాత ఆ దూడను, ఆవు తల, కాళ్లను అక్కడే వదిలేసి మిగతా శరీర భాగాన్ని తీసుకెళ్లారు. ఇలా వదిలేసిన దూడ, ఆవు శరీరభాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.   

ఈ అమానవీయ ఘటన ఉత్తర కన్నడ జిల్లా హోన్నవర తాలూకా సల్కోడు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గర్భంతో వున్న గోవును చంపిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే  10 మంది అనుమానితులను గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ నారాయణ వెల్లడించారు. పరారీలో వున్న మిగతావారికోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. 

అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని... అందువల్లే అటవీశాఖ అధికారుల సాయంతో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. ఈ వ్యవహారానని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి వెల్లడించారు. ఆవు శరీరభాగాలు, దూడను వదిలివెల్లిన ప్రాంతంలో కీలక ఆధారాలన్ని సేకరించినట్లు తెలిపారు. 

ఇలా అత్యంత దారుణంగా చంపబడ్డ ఆవు స్థానికుడు కృష్ణ ఆచారిది. ఆదివారం మేతకు అడవిలోకి వెళ్లిన ఆవు కనిపించకుండా పోయింది. దీన్నివెతుక్కుంటూ వెళ్లిన యజమానికి ఓ చోట చచ్చి పడివున్న దూడ, ఆవు తల,కాళ్లు కనిపించాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

ఇలా అత్యంత పాశవికంగా గర్భంతో వున్న ఆవును చంపిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కృష్ణ ఆచారితో పాటు హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది చేసింది ఎవరైనా వదిలిపెట్టకూడదని పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కూడా జంతుహింస చట్టంకింద కేసు నమోదు చేసి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios