ఐదు రాష్ట్రాల ఎన్నికలు : మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతకు ముగిసిన ప్రచార గడువు, ఎల్లుండి పోలింగ్

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి తెర లేచింది. మిజోరంలోని మొత్తం  40 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది.

Polling countdown begins as campaigning for Mizoram, Chhattisgarh Phase 1 ksp

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి తెర లేచింది. మిజోరంలోని మొత్తం  40 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. ఈ రెండు చోట్లా కలిపి 60 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 

40 స్థానాలున్న మిజోరంలో 8.57 లక్షల మంది ఓటర్లున్నారు. 174 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్, జోరం పీపుల్స్ మూవ్‌మెంట్, కాంగ్రెస్‌లు అన్ని స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టారు. బీజేపీ 23 స్థానాలకు, ఆప్ నలుగురిని పోటీకి పెట్టగా.. 27 చోట్ల స్వతంత్రులు బరిలోకి దిగారు. అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు తమ తమ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు. అయితే ఎనప్నికల సంఘం పోలింగ్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు పోస్టల్ బ్యాలెట్.. వయో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. తద్వారా 2059 మంది వృద్ధులు, దివ్యాంగులు.. 8526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఇక ఛత్తీస్‌గఢ్ విషయానికి వస్తే.. ఇక్కడ తొలి విడతలో 20 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి అధికారం దక్కే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నప్పటికీ.. బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక పోలింగ్‌కు ముందు సీఎం భూపేష్ బఘేల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో తొలి విడత నవంబర్ 7న 20 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 17న 70 స్థానాలకు మలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరగుతున్న 20 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios