భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఆమె కోరికనవన్నీ అందించడానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో..దొంగలా మారి ఆమె కోరికలు తీర్చాడు. వరసగా బైకులు దొంగతనాలు చేస్తూ.. వాటిని అమ్మిన డబ్బుతో విలాసంగా జీవిస్తూ వచ్చాడు. కాగా.. చివరకు జైలుపాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 భావ్ నగర్ జిల్లా జలియా గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. చాలీచాలని డబ్బులతో వారి జీవితం సాధారణంగా సాగిపోయేది. కాగా.. ఆ జీవితం బల్వంత్ భార్యకు నచ్చలేదు. తనకు లగ్జరీ లైఫ్ కావాలంటూ భర్తపై ఒత్తిడి తెచ్చేది.

దీంతో ఆమె పోరు భరించలేక బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బైకుల దొంగతనాలను మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.