ఇంట్లో పాలేరుగా పనిచేస్తూ.. ఆ యజమాని ఇంటికి తీరని అన్యాయం చేశాడు. యజమాని ఐదేళ్ల కుమార్తె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాందేడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ  రైతు బుధవారం మధ్యాహ్నం తన మనవరాలిని తీసుకొని పొలానికి వెళ్లాడు. కాసేపటికి చిన్నారి ఏడుస్తుండటంతో... ఇంటి వద్ద దింపమని తమ ఇంటి పాలేరుకి అప్పగించాడు. 

సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మనవరాలు, పాలేరు ఇద్దరూ లేకపోవడంతో కంగారుపడ్డాడు. స్థానికులతో కలిసి చూట్టూరా వెతకగా.. రాత్రి 8గంటల సమయంలో ఓ చోట చిన్నారి చెప్పులు కనిపించాయి.

ఆ చుట్టుపక్కల వెతకగా.. చిన్నారి మృతదేహం కనపడింది. చిన్నారి ఒంటిపై దుస్తులు లేకపోవడం.. పంటిగాట్లు కనిపించడంతో.. అత్యాచారం చేసి.. చంపేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.  ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.