Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం: కేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరా తీశారు ప్రధాని మోడీ. వర్ష ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్ధితిపై ప్రధానికి వివరించారు జగన్. 

pm narendra modi phone call to telugu states cms over heavy rains
Author
New Delhi, First Published Oct 14, 2020, 8:22 PM IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరా తీశారు ప్రధాని మోడీ. వర్ష ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్ధితిపై ప్రధానికి వివరించారు జగన్. వాయుగుండం తీరం దాటిందని, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయన్నారు జగన్.

అలాగే అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా మోడీ ఫోన్ చేశారు. హైదరాబాద్‌లో వర్ష బీభత్సంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్‌ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios