Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియా రారాజు నరేంద్ర మోడీ: రెండో స్థానంలో వైఎస్ జగన్

సోషల్ మీడియా రారాజుగా ప్రధాని నరేంద్ర మోడీ వెలుగొందుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ లో మోడీ తొలి స్థానం పొందారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండో స్థానంలో నిలిచారు.

PM Narendra Modi in social media trends, YS Jagan in second place
Author
new delhi, First Published Nov 24, 2020, 7:46 AM IST

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతోంది. అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా మోడీ ప్రథమ స్థానం ఆక్రమించారు. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ వేదికల్లో అత్యధికం ట్రెండ్స్ మోడీ పేరు మీద ఉన్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ సంస్థ తన నివేదికను వెల్లడించింది. 

గత మూడు నెలల కాలంలో టాప్ పొలిటికల్ లీడర్స్, అత్యంత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ విశ్లేషించి నివేదిక రూపొందించింది. సుమారు 10 కోట్ల ఆన్ లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా తొలి నివేదికను సంస్థ విడుదల చేసింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్ ల్లో అత్యధిక ట్రెండ్స్ మోడీ పేరు మీద ఉన్నాయని నివేదిక వెల్లడిచింది. 

ఆ నివేదిక ప్రకారం మోడీ 2,171 ట్రెండ్స్ తో మోడీ ప్రథమ స్థానంలో నిలువగా, 2,137 ట్రెండ్స్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో స్తానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెసు నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. 

బ్రాండ్ స్కోర్ విషయంలో కూడా మోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన 70 స్కోర్ తో ఆ స్థానం పొందారు. సోషల్ మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్ మెంట్, మెన్షన్స్ ఆధారంగా ఈ బ్రాండ్ స్కోరును నిర్ధారిస్తారు. ఇందులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 36.43 శాతం స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు.  ఆ తర్వాతి స్థానాల్లో సోమవారం దివంగతుడైన అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగోయ్ 31.89 శాతంతో , అరుణచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ 31.89 శాతంతో, యూపి ఎంసీ యోగీ ఆదిత్యానాథ్ 27.03 శాతంతో ఉన్నారు. 

బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా మోడీ ప్రథమ స్తానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ.336 కోట్లు. ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అమిత్ షా బ్రాండ్ వాల్యూ 335 కోట్లు కాగా, కేజ్రీవాల్ బ్రాండ్ వాల్యూ 328 కోట్లు. బ్రాండ్ వాల్యూను ఫాలోవర్లు, ఎంగేజ్ మెంట్స్, ట్రెండ్స్ ఆధారంగా ఖరారు చేస్తారు. వ్యత్రిక వ్యాఖ్యలు, వ్యతిరేక సెంటిమెంట్ల ఆధారంగా బ్రాండ్ వాల్యూను తగ్గిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios