Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి రెండు రోజుల కేర‌ళ, క‌ర్నాట‌క‌ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ: గురువారం నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలలో రెండు రోజుల పర్యటనకు ప్ర‌ధాని మోడీ వెళ్ల‌నున్నారు. సెప్టెంబర్ 2న కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రధాని మోడీ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించనున్నారు.
 

PM Modi to visit Kerala and Karnataka for two days from today
Author
First Published Sep 1, 2022, 6:09 AM IST

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ద‌క్షిణ‌భార‌తంలో త‌న‌ రెండు రోజుల పర్యటనకు నేడు బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం నుంచి కేరళ, కర్ణాటకలలో రెండు రోజుల పర్యటనకు ప్ర‌ధాని మోడీ వెళ్ల‌నున్నారు. ఈ పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 2న కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ఆయ‌న ప్రారంభించనున్నారు. అలాగే, క‌ర్నాట‌కలోని మంగళూరులో దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీ సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ ఆదిశంకర జన్మ భూమి క్షేత్రంను  సంద‌ర్శించ‌నున్నారు. ఇది కొచ్చిన్ విమానాశ్రయానికి సమీపంలోని కాలడి గ్రామంలోని ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలం.

మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు, కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రధాని మోడీ మొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా, వలస గతాన్ని దూరం చేస్తూ కొత్త నౌకాదళ ఎన్సైన్‌ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. INS విక్రాంత్‌ను భారత నౌకాదళం అంతర్గత యుద్ధనౌక డిజైన్ బ్యూరో (WDB) రూపొందించింది.  ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌చే నిర్మించబడింది. ఇది అత్యాధునిక ఆటోమేషన్ ఫీచర్లతో నిర్మించారు. 

మధ్యాహ్నం 1:30 గంటలకు కర్ణాటకలోని మంగళూరులో దాదాపు రూ. 3800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం,శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆ తర్వాత బెర్త్ నెం.14 యాంత్రీకరణను జాతికి అంకితం చేస్తారు. న్యూ మంగుళూరు పోర్టుకు వచ్చే కంటైనర్లు-ఇతర సరుకులను ఇది నిర్వహిస్తుంది. ఆ తర్వాత మంగ‌ళూరులోని రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వ‌ద్ద ఇంటిగ్రేటెడ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్-బల్క్ లిక్విడ్ పెట్రోలియం, ఆయిల్  అండ్ లూబ్రికెంట్ సౌకర్యాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ. 1000 కోట్ల విలువైన స్టోరేజీ ట్యాంకులు, ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ, బిటుమెన్ స్టోరేజీ, అనుబంధ సదుపాయాలతో సహా ఐదు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌కు చెందిన BS VI అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్, సీ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్ కూడా సెప్టెంబర్ 2న జాతికి అంకితం కానున్నాయి. న్యూఢిల్లీకి బయలుదేరే ముందు, కులాయ్‌లో ఫిషింగ్ హార్బర్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

సాంఘిక‌ సంక్షేమం అండ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కోట శ్రీనివాస్ పూజారితో కర్ణాటకకు చెందిన రాజకీయ నాయకులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రధానమంత్రికి స్వాగత సందేశాలను పోస్ట్ చేసారు. “యక్షధ్రువ పట్ల సతీష్ శెట్టి యక్షగాన పాట ద్వారా మంగళూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం” అంటూ ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios