సౌదీ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన పీఎం మోడీ.. ఇరు దేశాలతో పాటు పలు ప్రపంచ సమస్యలపై చర్చ
New Delhi: సౌదీ అరేబియా యువరాజు, ఆ దేశ పీఎం తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ బహుళప-ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
PM Modi spoke to the Crown Prince of Saudi Arabia: సౌదీ అరేబియా యువరాజుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ బహుళప-ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సూడాన్ సంక్షోభం నేపథ్యంలో సుడాన్ నుంచి జెడ్డా మీదుగా భారతీయులను తరలించే సమయంలో సౌదీ అరేబియా మద్దతు ఇచ్చినందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ప్రధాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకెళ్తే... సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ప్రయోజనాలున్న వివిధ బహుళపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. 2023 ఏప్రిల్ లో సూడాన్ నుంచి జెడ్డా మీదుగా భారతీయులను తరలించే సమయంలో సౌదీ అరేబియా అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ప్రధాన మంత్రి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే హజ్ యాత్రకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా భారత్ చేపడుతున్న కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందనీ, తన భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. ఇరువురు నేతలు టచ్ లో ఉండేందుకు అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, 'ఆపరేషన్ కావేరి' కింద, భారత్ తన పౌరులను ఖార్టూమ్-ఇతర సమస్యాత్మక ప్రాంతాల నుండి బస్సులలో పోర్ట్ సూడాన్ కు తీసుకువెళ్ళింది, అక్కడ నుండి భారత వైమానిక దళ హెవీ-లిఫ్ట్ రవాణా విమానాలు-భారత నావికాదళం నౌకలలో సౌదీ అరేబియా నగరం జెడ్డాకు తీసుకువెళ్ళింది. జెడ్డా నుంచి భారతీయులను వాణిజ్య విమానాలు, ఐఏఎఫ్ విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సౌదీ అరేబియా భారత్ ఎంతో సహకారం అందించింది.