PM Modi: భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదనీ, ప్రపంచ వివాదాల మధ్య నేటికీ మొత్తం ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని, సిక్కు గురువుల ఆదర్శాలను దేశం అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.
PM Modi: భారతదేశం ఏ దేశానికి లేదా సమాజానికి ఎప్పుడూ ముప్పు కలిగించలేదు. నేటికీ మనం సర్వలోక కళ్యాణం కోసమే ఆలోచిస్తాం. ప్రపంచ వివాదాల మధ్య నేటికీ మొత్తం ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని, సిక్కు గురువుల ఆదర్శాలను దేశం అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో మతం, మానవ విలువలు, ఆదర్శాలు, సూత్రాలను రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన తొమ్మిదవ సిక్కు గురువు బోధనలను ప్రస్తవించారు. గురు తేజ్ బహదూర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 24న ‘షాహీదీ దివస్’గా జరుపుకుంటారు. అతను శిరచ్ఛేదం చేసిన ప్రదేశంలో నిర్మించిన గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ , ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ అతని త్యాగానికి సంబంధించినవి. అతని వారసత్వం దేశానికి గొప్ప ఏకీకరణ శక్తిగా పనిచేస్తుంది.
మొఘల్‌లను ఎదిరించిన గురు తేజ్ బహదూర్ జీవితం, చరిత్రలో భారతదేశం తన గుర్తింపును కాపాడుకోవాలనే గొప్ప ఆశ ఉందని ఆయన పేర్కొన్నారు. ఔరంగజేబు నిరంకుశ ఆలోచనల ముందు, గురు తేజ్ బహదూర్ జీ, 'హింద్ ది చాదర్'గా మారాడు, ఒక శిలలా నిలిచాడు" అని మోడీ అన్నారు. ఔరంగజేబు, అతని వంటి నిరంకుశులు చాలా మందిని పొట్టనబెట్టుకున్నారని, అయితే మా విశ్వాసాన్ని మన నుండి వేరు చేయలేమని ఎర్రకోట సాక్షిగా ప్రధాని అన్నారు. గురు తేజ్ బహదూర్ త్యాగం భారతదేశంలోని అనేక తరాల వారి సంస్కృతి యొక్క గౌరవం, ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి జీవించడానికి ప్రేరేపించిందని ఆయన అన్నారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. 1675లో గురు తేజ్ బహదూర్‌ను ఉరితీయాలని ఔరంగజేబు ఆదేశాలు ఇచ్చాడు అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో కాకుండా ఈ ప్రాంతంలో ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు.. 2018లో స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వం స్థాపించి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసగించారు.
ప్రధానికి కట్టుదిట్టమైన భద్రతా
ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది దిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో రక్షణ వలయాలను ఏర్పాటు చేశారు. ప్రసంగ వేదికతో పాటు కోటలో సీసీటీవీ కెమెరాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలు, కైట్ క్యాచర్లు, కానైన్ యూనిట్లు, షార్ప్ షూటర్లు ప్రధాని భద్రతాతలో పాల్గొన్నాయి. అలాగే దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోన్న తరుణంలో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజు చేసే ఏర్పాట్ల మాదిరిగానే పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నాం. అలాగే జహంగీర్‌పురి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మేం మరింత అప్రమత్తంగా ఉండాలని సీనియర్ అధికారి తెలిపారు.
