ప్రధాని నరేంద్రమోదీ అన్న కుమార్తె దమయంతి బెన్ మోదీ పర్స్ ని ఇటీవల ఓ దొంగ కొట్టేసిన సంగతి తెలిసిందే. కాగా.... ఆమె పర్స్ ని దొంగలించిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్స్ లైన్స్ వద్ద ఆటోలో నుంచి దిగిన దమయంతి పర్స్ ని బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లారు.

ఆమె పర్స్ లో రూ.56వేల నగదు, రెండు ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితులైన గౌరవ్ అలియాస్ సోను(21)ని హరియాణాలోని సోనిపట్ లో, బాదల్ ను సుల్తాన్ పురిలో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పర్స్ ని, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.