Asianet News TeluguAsianet News Telugu

అశోక్ గెహ్లాట్‌ను పీఎం మోడీ ప్రశంసించడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఆజాద్ ఏం చేశాడో మరిచిపోవద్దు: సచిన్ పైలట్

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని సచిన్ పైలట్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ ఎపిసోడ్‌ను ప్రస్తావించారు.
 

pm modi praised rajasthan cm ashok gehlot.. sachin pilot says its interesting
Author
First Published Nov 2, 2022, 4:47 PM IST

న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయం హీటెక్కుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలని సచిన్ పైలట్ అన్నారు. అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుంటూ అధ్యక్ష అభ్యర్థి ప్రకటన సమయంలో రాజీనామా చేస్తామని హెచ్చరించిన ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాజస్తాన్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అశోక్ గెహ్లాట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించడాన్ని ఆయన ప్రస్తావించారు.

మీడియాను ఉద్దేశించి సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి మోడీ.. సీఎం అశోక్ గెహ్లాట్‌ను నిన్న ప్రశంసించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. దీన్ని చాలా లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే.. గతంలోనూ ప్రధానమంత్రి మోడీ.. గులాం నబీ ఆజాద్‌ను పార్లమెంటులో ప్రశసించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే’ అని అన్నారు.

రాజస్తాన్‌లోని బాన్‌స్వారాలో ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం అశోక్ గెహ్లాట్‌లు వేదిక పంచుకున్నారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ‘అశోక్ గెహ్లాట్.. నేను కలిసే ముఖ్యమంత్రులుగా చేశాం. మా దానిలో ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఈ స్టేజీపై ప్రస్తుతం కూర్చున్న ముఖ్యమంత్రుల్లో ఆయన చాలా సీనియర్ మోస్ట్’ అని వివరించారు.

రాజస్తాన్‌లో మరోసారి సీఎం కుర్చీ చుట్టూ రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోసారి అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ పోరు రచ్చకు ఎక్కబోతున్నట్టు తెలుస్తున్నది. మరో 13 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. అశోక్ గెహ్లాట్ టీమ్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. అశోక్ గెహ్లాట్‌ను అధిష్టానం కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన తరుణంలో ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ గెహ్లాట్ అనునాయ వర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్‌లో క్యాంపెయినింగ్ చేస్తున్న సచిన్ పైలట్ ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదట పార్టీలో అంతర్గతంగా నేతలు ఏమనుకుంటున్నారో వింటానని, ఆ తర్వాతే మాట్లాడుతానని చెప్పారు. తాజాగా మాట్లాడుతూ, రాజస్తాన్‌లో నెలకొన్నఅనిశ్చిత వాతావరణానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. రాజస్తాన్ పరిస్థితులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ అబ్జర్వర్ కేసీ వేణుగోపల్ ఇది వరకే పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అందరికీ ఒకే న్యాయాన్ని అందిస్తుందని, సీనియర్లు అనే మినహాయింపులు ఏమీ ఇవ్వకుండా అందరితోనూ సమానంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాబట్టి, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios