బిజెడి వాకౌట్: ముసిముసిగా నవ్విన ప్రధాని మోడీ

First Published 20, Jul 2018, 12:52 PM IST
PM Modi happy with BJD's walkout
Highlights

అవిశ్వాస తీర్మానంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి వైఖరి ప్రధాని నరేంద్ర మోడీకి ఊరటనిచ్చినట్లే ఉంది.  బిజూ జనతా దళ్ (బీజేడీ) లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది బిజెపికి కలిసి వచ్చే విషయం.

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి వైఖరి ప్రధాని నరేంద్ర మోడీకి ఊరటనిచ్చినట్లే ఉంది.  బిజూ జనతా దళ్ (బీజేడీ) లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది. ఇది బిజెపికి కలిసి వచ్చే విషయం.

చర్చలోని అంశాలకు ఒడిశాతో సంబంధం లేనందు వల్ల సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బిజెడి ప్రకటించింది. బీజేడీ సభ్యులు సభనుంచి వెళ్లిపోవడం చూస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ముసిముసిగా నవ్వులు కురిపించారు.
 
కాగా సభ ప్రారంభం కాగానే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టారు.  తొలుత సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా మాట్లాడాల్సిందిగా స్పీకర్ అవకాశం ఇచ్చారు. 
శుక్రవారం సాయంత్రం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. చర్చ నేపథ్యంలో సభ్యులకు మధ్యాహ్న విరామం కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. 

ప్రతిపక్షాలకు కేటాయించిన సమయం అన్ని అంశాలను ప్రస్తావించేందుకు సరిపోదని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.

loader