హత్రాస్ ఘటన విషయంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. .  హత్రాస్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడంపై కారణమేమిటో చెప్పాలన్నారు. 

న్యూఢిల్లీ: హత్రాస్ ఘటన విషయంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. . హత్రాస్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడంపై కారణమేమిటో చెప్పాలన్నారు. 

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.22 రోజుల్లో కరోనా ముగిసిపోయిందని ప్రధాని మోడీ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు కార్పోరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. 

దేశ ఆర్ధిక వ్యవస్థను మోడీ కుప్పకూల్చారని ఆయన ఆరోపించారు. రైతులను కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఆహారభద్రతపై కూడ కన్పించనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Scroll to load tweet…

బాధిత కుటుంబం ఒంటరిగా లేదని.. వారికి తాము అండగా ఉన్నామని చెప్పాలనుకొన్నామన్నారు. కానీ యూపీ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై మోడీ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.

లాక్ డౌన్ సమయంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులను దెబ్బతీసినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు.కరోనా గురించి తాను ఫిబ్రవరి మాసంలోనే హెచ్చరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.