ఇండియా అనే పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌ గా మార్చాలంటూ సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం జూన్ 2 న విచారణ జరపనుంది. అలా పేరు మార్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.

ఇండియా అనే పేరు ను మార్చి భారత్‌ లేదా హిందుస్తాన్‌ గా పిలిచేలా రాజ్యాంగం లోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది.

ఆర్టికల్ 1 లోనే దేశం పేరు, సరిహద్దులు కూడా నిర్దేశించి ఉంటాయి. వాస్తవానికి ఈ పిటిషన్ శుక్రవారమే (మే 29) సుప్రీంకోర్టు లో విచారణకు లిస్ట్ అయింది. అయితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్.ఏ బాబ్డే అందుబాటు లో లేక పోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు.

సుప్రీంకోర్టు లో అందుబాటు లో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ జూన్ 2 వ తేదీన కోర్టు ముందుకు విచారణకు రానుంది. ఢిల్లీ కి చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్‌ ను దాఖలు చేశారు.

భారత్ అనే పేరు ను హిందుస్తాన్‌ గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలన లో ఉన్నామనే భావన నుంచి బయట పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ఇంగ్లీష్ పేరు ను తొలగించి ఆ స్థానం లో ప్రతీకగా భావించే మరో పదం చేర్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయతా భావం పెరుగుతుంది.

ఓ రకంగా ఇండియా అనే పేరును తీసేసి అక్కడ భారత్ అనే పేరు చేర్చడం వల్ల స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది.’ అని పిటిషన్‌ లో పేర్కొన్నారు.

1948 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయం లోనే ఇండియా అనే పేరు స్థానం లో భారత్ లేదా హిందుస్తాన్ అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్‌ లో గుర్తు చేశారు.