పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై తేదీలపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. గణేశ్ చతుర్థి వేడుకలతో ఈ తేదీలో కలిసిపోతున్నాయని, కాబట్టి, తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పడం సరైనదా? అని ఆలోచించాల్సిన సమయం ఆసస్నమైంది. 

న్యూఢిల్లీ: ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రకటనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే.. ఈ తేదీలపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ తేదీల్లోనే గణేశ్ చతుర్థి వస్తున్నది. ముంబయిలో ప్రతిపక్ష సమావేశాలు జరగనున్న సందర్భంలో ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం గమనార్హం.

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన గణేశ్ చతుర్థి వేడుక జరుపుకునే తేదీలో ప్రత్యేక సమావేశాలకు పిలుపు నివ్వడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం హిందువులు భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. వారి తేదీల ఎంపికను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై ప్రశ్నలు కురిపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి ఇప్పుడే చదివానని, ఆ తేదీలు గణేష్ చతుర్థి తేదీలతో కలుస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో గణేశ్ చతుర్థి అతిపెద్ద పండుగ అని వివరించారు. కాబట్టి, తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని ట్వీట్ చేశారు. 

Also Read: ఇక నుంచి కౌలు రైతులకూ పెట్టుబడి సాయం.. రేపు ప్రారంభించనున్న సీఎం జగన్..

ఈ సమావేశాలు జరుగుతాయనే వార్త తప్పితే.. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తారనే దానిపై స్పష్టత లేదు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అమృత కాలం గురించి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ వంటి అంశాలపై డిస్కషన్స్ ఉంటాయని తెలిపారు. 

ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది.