న్యూఢిల్లీ: పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ప్రదర్శించటం మాత్రం మానుకోవట్లేదు. మానుకోకపోగా రోజు రోజుకు హద్దు మీరుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాద స్థావరాలపై భారత్ ఆర్టిలరీ గన్నులతోని దాడి చేసి వాటిని కూల్చిన విషయం తెలిసిందే. 

భారత్ ఇలా దాడులు చేయడం కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ, భారత హై కమీషనర్ ఆహ్లువాలియాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉగ్రవాద స్థావరాల్లో భారత్ మీదికి ఉసిగొలిపేందుకు ఉగ్రఫేవాదులను తయారుచేస్తున్నారు. వీరు ఈ స్థావరాల్లో కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాటిని కూల్చడం భారత సరిహద్దు రక్షణ, దేశ శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమని సైనికాధికారులు తెలిపారు. 

ఈ దాడులకు సంబంధించి భారత సైన్యం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో  భారత సైన్యం దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు.  తంగ్థార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో 5గురు పాకిస్థాన్ సైనికులతోపాటు మరికొంతమంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని భారత సైన్యం తెలిపింది. 

ఐదుగురు సైనికులు చనిపోయారని భారత సైన్యం అసత్య ప్రసిఫరం చేస్తోందని పాక్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. కేవలం ఒక్క పాకిస్థాన్ సైనికుడు మాత్రమే చనిపోయాడని తెలిపింది పాకిస్తాన్.