Asianet News TeluguAsianet News Telugu

పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులు ఎందరో తెలుసా..?

పాకిస్తాన్ జైళ్లలో 319 మంది భారతీయులు (49 మంది పౌరులు, 270 మంది మత్య్సకారులు) మగ్గుతున్నారు. ఈ మేరకు దాయాది దేశం భారత్‌కు వెల్లడించింది. భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ వివరాలను మనదేశానికి అందించింది

pakistan india swap list of prisoners and list of nuclear installations ksp
Author
Islamabad, First Published Jan 1, 2021, 8:30 PM IST

పాకిస్తాన్ జైళ్లలో 319 మంది భారతీయులు (49 మంది పౌరులు, 270 మంది మత్య్సకారులు) మగ్గుతున్నారు. ఈ మేరకు దాయాది దేశం భారత్‌కు వెల్లడించింది. భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ వివరాలను మనదేశానికి అందించింది.

ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌కు పాక్‌ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. 2008 మే 21 జరిగిన కాన్సులర్‌ యాక్సిస్‌ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఖైదీల వివరాలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది. ఇందులో 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు ఉన్నారు. సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ సమాచార మార్పిడి మాత్రం నిరాటంకంగా జరుగుతోంది. 

ఇక గత 30 ఏళ్లుగా భారత్‌ -పాక్‌ మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు అణ్వాయుధాల వివరాలను సైతం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల మధ్యనున్న వైరం కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

1991, జనవరి 27 నుంచి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. మొదటిసారిగా ఈ వివరాలను 1992 జనవరి 1 నుంచి పరస్పరం మార్పిడి చేసుకుంటూ వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios