దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దేశంలో శుక్రవారం నాడు 59, 118 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,18, 46,652 కి చేరుకొంది.

దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మాస్కులు దరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి వాటి కారణంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడాది అక్టోబర్ మాసంలో ఒకే రోజులు 61,871 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యంలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని ప్రధాని మోడీ కోరిన విషయం తెలిసిందే.