Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా.. 45వేలు దాటిన మరణాలు

దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య‌ లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది. కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు పట్టింది. 

over 53,000 new covid19 cases, 871 deaths take india's tally to 2.26 million and recovery rate at 69.79 percent
Author
Hyderabad, First Published Aug 11, 2020, 11:40 AM IST

భారత్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 60వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. కాగా.. నిన్న ఒక్కరోజు మాత్రం కొద్దిగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 

గడ‌చిన‌ 24 గంటల్లో కొత్త‌గా 53,600 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 871 మంది మృతిచెందారు. గ‌డ‌చిన 24 రోజుల్లో కోవిడ్ -19 కేసులు 10 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగాయి. గత 4 రోజులలో రోజుకు 60 వేల‌కుపైగా కేసులు నమోదవుతున్నాయి. రిక‌వ‌రీ రేటు కూడా పెరిగింది. గ‌డ‌చిన 24 గంటల్లో 47,745 మంది కోలుకున్నారు. దేశంలో రోగుల రికవరీ రేటు 70 శాతంగా ఉంది. 

జూలై 17 నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832గా ఉండ‌గా, మృతుల‌ సంఖ్య 25,602గా ఉంది. అయితే ఆగస్టు 7న కరోనా వైరస్ కేసుల సంఖ్య 20,27,074 కు పెర‌గ‌గా, మృతుల సంఖ్య 41,585కి చేరుకుంది. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య‌ లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది. కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు పట్టింది. 

18 రోజుల్లో మొత్తం కేసుల సంఖ్య‌ 4 లక్షలకు చేరుకుంది. క‌రోనా కార‌ణంగా ఆంధ్రప్ర‌దేశ్‌, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల‌లో ఒక్కో రాష్ట్రంలో 2000 కుపైగా మృతిచెందారు. అరుణాచల్, మిజోరం, సిక్కింల‌లో ఐదుగురి కంటే తక్కువ మంది మృతిచెందారు. అరుణాచల్‌లో ముగ్గురు, సిక్కింలో ఒక్క‌రు చొప్పున మరణించారు. మిజోరంలో క‌రోనా కారణంగా ఇంత‌వ‌ర‌కూ ఎవరూ మృతిచెంద‌లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios