Coronavirus vaccine: 2 కోట్ల మంది టీనేజర్లకు అందిన టీకాలు..
Coronavirus vaccine: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తూ.. తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల మంది 15-18 సంవత్సరాల పిల్లలకు కరోనా టీకాలు అందించామని ప్రభుత్వం వెల్లడించింది.
Coronavirus vaccine: కరోనా వైరస్ మళ్లీ తన ప్రతాపం చూపుతోంది. కొత్తగా కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన Coronavirus ఒమిక్రాన్ వేరియంట్ సైతం భారత్ లో క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలను ప్రభుత్వాలు వేగవంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి సైతం టీకాలు అందిస్తోంది ప్రభుత్వం. కేవలం ఆరు రోజుల్లోనే రెండు కోట్ల మందికిపైగా టీనేజర్లు కరోనా టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈనెల 3న 15-18 ఏండ్ల టీనేజర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు విద్యా సంస్థల్లో విస్తృతంగా వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఆరు రోజుల్లోనే 15 నుంచి 18 ఏండ్ల వయస్సున్న 2 కోట్లకుపైగా యువత టీకా తీసుకున్నారని కేంద్ర మంత్రి చెప్పారు.
బుధవారం (జనవరి 5న) మధ్యాహ్నం వరకే దేశంలో కోటి మందికిపైగా టీనేజర్లు తొలి డోస్ వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 15-18 ఏండ్ల ఏజ్ గ్రూప్‌లో అందరికీ కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా టీనేజర్లు తొలి డోస్ టీకాలు వేయించుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లకు Coronavirus వ్యాక్సిన్ అందిచనున్నట్లు ప్రధాని మోడీ గత డిసెంబర్ 26న ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం (జనవరి 3) వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. తొలి డోసు తీసుకున్న వారందరికి నాలుగు వారాల తర్వాత రెండో డోసు వేయనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపింణీచేసినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
ఇప్పటివరకు దేశంలో 68,68,19,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 15,13,377 Coronavirus శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. ఇదిలావుండగా, ఇప్పటివరకు దేశంలో 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 85.8 కోట్లు మందికి మొదటి డోసు అందించారు. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 62.8 కోట్లకు చేరింది. ఇక భారత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం మొదలైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల గరిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19 మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మళ్లీ లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ Coronavirus కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువైంది. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది.