Asianet News TeluguAsianet News Telugu

రామమందిర విరాళాలు.. 15 వేల చెక్కులు బౌన్స్.. !!

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ సేకరించిన చెక్కుల్లో 15వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి. వీటి విలువ రూ. 22 కోట్లు అని సమాచారం. 

Over 15,000 cheques worth Rs 22 crore received for Ram temple in Ayodhya bounce - bsb
Author
Hyderabad, First Published Apr 16, 2021, 2:37 PM IST

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ సేకరించిన చెక్కుల్లో 15వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి. వీటి విలువ రూ. 22 కోట్లు అని సమాచారం. 

అయితే ఇవి కావాలని జరిగినవి కాదని, బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం లేదా సాంకేతిక లోపాల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్టుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది.

సాంకేతిక లోపాలను సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా పేర్కొన్నారు. ప్రజలు మరోసారి డొనేషన్ ఇవ్వాలని బ్ాయంకులు అడుగుతున్నట్టు ఆయన తెలిపారు.

కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2వేల  చెక్కులు అయోధ్య నుంచే వచ్చినట్టు మిశ్రా పేర్కొన్నారు. జనవరి15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది.

ఈ సందర్బంగా  దాదాపు రూ.5 వేల కోట్లు సమకూరాయి. అయితే తుది వివరాలను ట్రస్ట్ ఇంకా ప్రకటించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios