మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణించినప్పటి నుంచి ప్రముఖ నేతలు ఆయనతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధం కానీ ఆయనతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నారు.  

ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణించినప్పటి నుంచి ప్రముఖ నేతలు ఆయనతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధం కానీ ఆయనతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ సైతం వాజ్‌పేయీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. షర్మిష్టా చిన్నతనంలో ప్రణబ్‌ ఇంటి పక్కనే వాజ్‌పేయీ నివాసం ఉండేదట. ఓరోజు వాజ్‌పేయీ ఉదయం వాకింగ్‌కి వెళుతుంటే ప్రణబ్‌ ఇంట్లో ఉన్న పెంపుడు శునకం ఆయన్ని కరిచిందట. ఈ విషయాన్ని షర్మిష్టా ట్విటర్‌ ద్వారా తెలిపారు. నా చిన్నప్పుడు వాజ్‌పేయీజీకి జరిగిన ఓ సంఘటన గుర్తుకువచ్చింది. 

వాజ్‌పేయీజీ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. ఓసారి వాజ్‌పేయీజీ ఉదయం వాకింగ్‌కి వెళుతుంటే మా ఇంట్లో ఉన్న డాకూ(కుక్క పేరు) ఆయన్ను కరిచింది. దాని అరుపులు విని మా అమ్మ గబగబా బయటికి వచ్చి చూసింది. ఆ సమయంలో వాజ్‌పేయీ నవ్వుతూ కన్పించారు. అంతేకాదు మా అమ్మకు ఇంట్లో పెంచిన ఆకుకూరలను ఇచ్చి పంపేవారు. అలా మా రెండు ఇళ్ల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు, జ్ఞాపకాలు ఎక్కువగా ఉండేవని వెల్లడించారు.