Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలన్నీ వాకౌట్.. ఎంపీల సస్పెన్షన్‌పై వెంకయ్యనాయుడు కామెంట్

పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ద్రవ్యోల్బణం, ధరల పతనం, రైతలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ, క్వశ్చన్ అవర్ కాబట్టి, దాన్ని అనుమతించలేమని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలందరూ వాకౌట్ చేశారు. అనంతరం మిగతా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అందరూ వెళ్లిపోయారు. కాగా, 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో ఈ రోజు చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు మాట్లాడారు.

opposition staged walk out from rajyasabha
Author
New Delhi, First Published Dec 2, 2021, 2:18 PM IST

న్యూఢిల్లీ: Pariament సమావేశాలు ఈ రోజు కూడా Opposition ఆందోళనలతోనే ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనలు, నినాదాల నడుమ అసిస్టెడ్ రిప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు లోక్‌సభలో పాస్ అయింది. కాగా, Rajyasabhaలో మాత్రం ఎంపీ Suspension వేటు ఎత్తేయాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. తాము లేవనెత్తిన అంశాలపై చర్చకు అనుమతించడం లేదని అన్ని ప్రతిపక్షాల ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్(Walk Out) చేశారు. 

తము లేవనెత్తిన ద్రవ్యోల్బణం అంశంపై చర్చించడానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడానికి కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత వామపక్ష పార్టీలు సహా ఇతర చిన్న పార్టీల ఎంపీలూ వారి వెంటే బయటకు నడిచారు. కాగా, రైతుల అంశాలపై నినాదాలు చేస్తూ ఆ తర్వాత టీఎంసీ, టీఆర్ఎస్, డీఎంకే పార్టీల ఎంపీలూ సభను విడిచి బయటకు నడిచారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ధరల పతనం, ద్రవ్యోల్బణం అంశాలను లేవనెత్తారు. వాటిపై చర్చించాలని డిమాండ్ చేశారు. కానీ, ఇది క్వశ్చన్ అవర్ అని, కాబట్టి, వాటిని అనుమతించలేమని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అన్నారు. దీనితో కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

Also Read: 12 మంది ఎంపీలపై సస్పెన్షన్: పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన

కాగా, ఈ వాకౌట్‌కు ముందే రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత సమావేశాల్లో ఎంపీలు అభ్యంతకరక ప్రవర్తనపై మాట్లాడారు. 12 ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. ఆగస్టులో జరిగిన సమావేశాల్లో ఈ సభలో ఉన్న కొందరు గౌరవనీయులైన సభ్యులు 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను అప్రజాస్వామికం అని పేర్కొంటున్నారని అన్నారు. వారు ప్రచారం చేస్తున్న ఇలాంటి తప్పుడు ధోరణులను ఎలా సమర్థించుకుంటారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. సస్పెన్షన్ విధించడాన్ని అప్రజాస్వామికమని సభ లోపల, వెలుపల వ్యాఖ్యలు చేస్తున్న ఆ సభ్యులు.. తాను ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి చెప్పిన కారణాల్లో ఒక్కదాన్నీ పేర్కొనలేదని చెప్పారు. గత సమావేశాల్లో ఆ ఎంపీల అభ్యంతరకర ప్రవర్తన కారణంగానే తాను సస్పెన్షన్ విధించారని అన్నారు.

లోక్‌సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. కరోనా మహమ్మారి, నూతన వేరియంట్ ఒమిక్రాన్‌ల కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా విమాన సేవలను పెంచాలని భావించిందని, విమానాల సంఖ్యను పెంచాలని ఆలోచించిందని పేర్కొన్నారు. కానీ, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఈ నిర్ణయాన్ని దెబ్బతీసిందని వివరించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం 11 దేశాలను ప్రమాదకరమైన దేశాలుగా పేర్కొన్నదని తెలిపారు.

Also Read: నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు:రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో (Parliament Monsoon Session) అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో 12 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ చేశారు. గత సెషన్‌లో గత సెషన్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టగా రాజ్యసభ కార్యాలయం తెలిపింది. శీతకాల సమావేశాలు (parliament winter session 2021)  మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. ‘రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ప్రవర్తన, ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారు. ఈ సభ సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభ నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన ద్వారా సభ కార్యకలపాలను ఉద్దేశపూర్వకంగా నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది’ అని అధికారిక నోటీసుల్లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios