కేంద్రంలో ఒకవేళ  హాంగ్ పరిస్థితితులు ఏర్పడితే త్వరితగతిన కదలడానికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శరద్ పవర్ - చంద్రబాబులు ఈ విషయమై అన్ని విపక్షాలతో చర్చిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితులు లేవని విశ్వసిస్తున్నాయి. 

ప్రస్తుతానికి మాయావతి అఖిలేష్ లాంటి వారు విపక్షాల భేటీకి దూరంగా ఉన్నప్పటికీ బిజెపియేతర కూటమి వైపు వారు మొగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇకపోతే తటస్తులుగా ఉన్నా నవీన్ పట్నాయక్ , కేసీఆర్ జగన్ లతో సైతం వారు చర్చలు జరుపుతున్నారు. హాంగ్ ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా రాష్ట్రపతికి అందరూ సంతకాలు చేసిన లేఖ ఇచ్చి తమకే సర్కారు ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరనున్నట్లు సమాచారం.