Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ బకాయిలు: పార్లమెంట్ వెలుపల వివిధ పార్టీల ఎంపీల నిరసన

జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గురువారం వివిధ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు

Opposition parties protest on Parliament grounds over GST
Author
New Delhi, First Published Sep 17, 2020, 3:24 PM IST

జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గురువారం వివిధ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. కేంద్రం జీఎస్టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన తదితర పార్టీల ఎంపీలు ఉన్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆయా రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్‌లో జమ చేసి వాడుకుంటోంది. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలని చెప్పడంపై వారు నిరసన తెలిపారు. ఐజీఎస్టీ సమావేశం వెంటనే నిర్వహించి, బకాయిలు విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios