Asianet News TeluguAsianet News Telugu

అరుదైన పాము.. విలువ రూ.9కోట్లు

మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని.. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

One Arrested With Rare Snake Species Worth Rs. 9 Crore In Bengal: Police
Author
Hyderabad, First Published Nov 24, 2018, 4:52 PM IST

అరుదైన రకానికి చెందిన ఓ పామును స్మగ్లింగ్ చేస్తూ.. ఓ వ్యక్తి కోల్ కతా పోలీసులకు చిక్కాడు. మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని.. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్‌కతాకు చెందిన ఇషా షేక్‌ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్‌ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్‌ ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లోని కలియాచాక్‌ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడటానికి బల్లిలా ఉండే తక్షక్‌ పాముల నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్‌లో ఇవి భారీ ధర పలుకుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios