ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. Bangarmau ప్రాంతంలోని ఓ ఆస్పత్రి గోడకు అక్కడ నర్సుగా పనిచేస్తున్న యువతి మృతదేహం వేలాడుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. Bangarmau ప్రాంతంలోని ఓ ఆస్పత్రి గోడకు అక్కడ నర్సుగా పనిచేస్తున్న యువతి మృతదేహం వేలాడుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. యువతిపై అత్యాచారం జరిపి, హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిచారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రి యాజమాన్యంతో సమా ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేశారు. యువతి మృతదేహం ఆస్పత్రి పై భాగంలోని ఇనుప రాడ్‌కు తాడుతో కట్టి గోడకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 

ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి శశి శేఖర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘న్యూ జీవన్ హాస్పిటల్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం కనిపించినప్పుడు.. ఆమె ముఖానికి ముసుగు ఉంది. అంతేకాకుండా ఆమె చేతిలో గుడ్డ ముక్క కనిపించింది. అయితే ముఖానికి ముసుగు వేసింది ఎవరు..?, ఆమె చేతిలో ఉన్న గుడ్డ ముక్క ఎవరిది..? అనే వివరాలు తెలసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు పంపించాం. ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఆస్పత్రికి సీలు వేశాం. మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది’’ అని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 

వివరాలు.. యువతి మృతదేహం వేలాడుతున్న ఆస్పత్రిని ఇటీవలే ప్రారంభించారు. బాధిత యువతికి అక్కడ నర్సుగా ఉద్యోగం రావడంతో.. అక్కడికి సమీపంలోని రూమ్ అద్దెకు తీసుకుంది. ఏప్రిల్ 29న ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయింది. అయితే ఆ రోజు పగటిపూట ఆస్పత్రిలో రోగులు లేకపోవడంతో యువతి.. రూమ్‌కు వచ్చింది. అయితే యువతికి రాత్రి 10 గంటలకు ఫోన్ చేసిన ఆస్పత్రి యజమాన్యం.. నైట్ షిఫ్ట్ చేయమని అడిగారు. దీంతో నైట్ షిఫ్ట్ చేయడానికి ఆమె ఆస్పత్రికి వెళ్లింది. 

ఇక, తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చిందని యువతి తల్లి తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని చూడగా తన కూతురు హత్యకు గురైనట్లుగా కనిపించిందని ఆమె అన్నారు.