మెట్రో రైలు వచ్చాక దాదాపు ప్రయాణం సులభమైంది. చాలా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారంటే అది కేవలం మెట్రోల వళ్లే. ఇప్పటి వరకు ప్రయాణం చేయడానికి మాత్రమే మెట్రో ఎక్కేవాళ్లు. ఇక నుంచి చిన్న చిన్న పార్టీలు అంటే.. బర్త్ డే పార్టీలు కూడా మెట్రోలో చేసుకోవచ్చు. కదులుతున్న మెట్రోలో పార్టీ  చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని తీసుకువచ్చారు.

అయితే.. ఇది హైదరాబాద్ మెట్రోలో మాత్రం కాదండోయ్. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ సదుపాయం తీసుకువచ్చింది ఢిల్లీ మెట్రో. ‘మెట్రో’లో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనుకునేవారు ప్రతీ గంటకు తగిన మొత్తంలో రుసుము చెల్లించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం కోచ్ బుకింగ్ కన్‌ఫర్మ్ అయిన తరువాత గంటకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకూ చెల్లించాల్సివుంటుంది. దీనితో పాటు బుకింగ్ చేసుకునే వారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 20 వేలు చెల్లించాల్సివుంటుంది. ఈ మెత్తాన్ని మెట్రో అధికారులు తరువాత తిరిగి చెల్లిస్తారు. 

Also Read రాజధాని దిశగా... విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పై ఏపి సర్కార్ కీలక నిర్ణయం...

ఈ అవకాశాన్ని ఢిల్లీ మెట్రో ప్రయాణికులు అందుకోనున్నారు. అక్వాలైన్‌పై నోయిడా-గ్రెనో మెట్రోలోని కోచ్‌లో బర్త్ డే పార్టీలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నడుస్తున్న ‘మెట్రో’ లేదా నిలిపివుంచిన ‘మెట్రో’లో బర్త్ డే పార్టీలు చేసుకునేందుకు అనుమతినిస్తున్నారు.

 నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎంఆర్సీ) ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రోలో పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి పార్టీలతో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇందుకోసం ఎన్ఎంఆర్సీ విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.