కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా దారుణ ఓటమితో జేడీఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ఈ క్రమంలో కర్ణాటకలో తమ పార్టీ నేతలెవరు టీవీ టిబేట్‌లు, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని తన పార్టీ నేతలను జేడీఎస్ ఆదేశించింది.

మరోవైపు జేడీఎస్-కాంగ్రెస్‌లు సరైన స్థాయిలో సత్తా చూపకపోవడంతో .. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ హెచ్‌కే పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానికులకు గాను 25 చోట్ల బీజేపీ గెలవగా.. కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరో స్థానంలో గెలవగా.. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్ధిగా సినీనటి సుమలత గెలిచారు.