భార్యకు వంట చెయ్యడం రాదని ఓ భర్త కోర్టుకు ఎక్కాడు. తనకు విడాకులు కావాలని పట్టుపట్టాడు. కాగా... భర్త చెప్పిన కారణం విని కోర్టు ఆ వ్యక్తికి అక్షింతలు వేసింది. ఈ సంఘటన ఛండీగడ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. అయితే తన భార్యకు వంట రాకపోవడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె మెట్టినిళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే కారణం చూపించి తనకు విడాకులు కావాలని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే అతడి వాదనలు విన్న కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. ‘‘భార్యకు వంట రాకపోవడం నేరమా? అదేమైనా క్రూరమైన చర్యనా? ఆమె ఇంట్లో ఎలాగైనా పెరిగి ఉండొచ్చు. అంత మాత్రం దానికి ఆమెను ఇబ్బంది గురి చేయరాదు’’ అని పిటిషన్ దారుణిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వంట చెయ్యడం రాకపోతే అదేమైనా నేరమా అంటూ న్యాయస్థానం అతనికి  అక్షింతలు వేసింది. ఆ తర్వాత దంపతులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.