వినియోగదారులకు శుభవార్త... నాన్‌ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100 రూపాయలు తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు తగ్గడంతో మన దేశంలోనూ తగ్గించామని ఐఓసీ పేర్కొంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.737.5కు లభించిన సిలిండర్ ఆది వారం రాత్రి నుంచి రూ.637కు తగ్గింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.494.35గా ఉంది.