Asianet News TeluguAsianet News Telugu

పద్మ అవార్డులకు నామినేట్ చేయండి: ప్రజలను కోరిన మోడీ

పద్మ  అవార్డుల కోసం అసాధారణ వ్యక్తులను, ప్రతిభావంతులను నామినేట్ చేసే అవకాశాన్ని ప్రజలకు కల్పించారు మోడీ. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు పద్మ అవార్డులకు నామినేట్ చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. 

Nominate Your Choice Of Inspiring People For Padma Awards: PM Modi To Citizens lns
Author
New Delhi, First Published Jul 11, 2021, 12:01 PM IST

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల కోసం  అసాధారణమైన  వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను కోరారు. ఈ మేరకు  ఆదివారం నాడు  ఆయన ట్విట్టర్ వేదికగా మోడీ ప్రజలను కోరారు. దేశంలో చాలామంది ప్రతిభావంతులున్నారని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అట్టడుగున అసాధారణమైన పనిచేస్తున్నారన్నారు. అయితే వారి గురించి  ఎక్కువగా పెద్దగా తెలియదన్నారు. అలాంటి వారిని పద్మ అవార్డుల కోసం నామినేట్ చేయాలని  మోడీ కోరారు.

 

ఇలాంటి వారిని పద్మ అవార్డుల కోసం నామినేట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 15 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు http://padmaawards.gov.in కు తమ నామినేషన్లను పంపాలని ఆయన  కోరారు.పద్మ పురస్కారాల పేరుతో పద్మ విభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులను కేంద్రం అందిస్తుంది.

కొన్నేళ్లుగా సమాజానికి జీవితాంతం చేసిన కృషితో పాటు పలు రంగాల్లో సాధించిన విజయాలకు మోడీ ప్రభుత్వం పద్మ అవార్డులను అందిస్తోంది. 1954లో పద్మ అవార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios