కూరగాయలు కొనడానికి రూ.30 అడిగిందని.. ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన  నోయిడాలో చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకి వెళితే... నోయిడాకి చెందిన సబీర్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. వివాహమైన నాటి నుంచి భార్యను నానా రకాలుగా వేధించేవాడు. కాగా... శనివారం కూరగాయలు కొనడానికి భార్య సబీర్ ని రూ.30 అడిగింది. తనను డబ్బులు అడిగిందని సబీర్ కోపంతో ఊగిపోయింది. ఆమెను దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో సబీర్ కి అతను సోదరులు జకీర్, ఇడ్రీస్, సోదరి సమా, తల్లి నజ్జోలు సహకరించారు. అందరూ కలిసి ఆమెపై దాడి చేశారు.

అనంతరం సబీర్ భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేసి.. బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేశాడు. తీవ్రగాయలైన బాధితురాలు అలానే వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. అతనిని కుటుంబసభ్యులు బెయిల్ పై బయటకు తీసుకువచ్చినట్లు పోలీసులు చెప్పారు.