Karnataka Hijab Row: కర్నాటక నెలకొన్న హిజాబ్ వివాదంపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కాలేజీలు, స్కూళ్లలోని విద్యార్థులంతా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే దాకా హిజాబ్, కాషాయపు కండువాలు లేదా మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Karnataka Hijab Row: కర్నాటక నెలకొన్న హిజాబ్ వివాదంపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కాలేజీలు, స్కూళ్లలోని విద్యార్థులంతా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే దాకా హిజాబ్, కాషాయపు కండువాలు లేదా మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొన్ని కాలేజీల్లో హిజాబ్‌ను పరిమితం చేస్తూ అమల్లోకి వచ్చిన “డ్రెస్ కోడ్”ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఈ నియమం కొన్ని కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది.
కాగా, విద్యా సంస్థలను తిరిగి తెరిచి, విద్యార్థులను త్వరగా తరగతులకు తిరిగి రావడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్లన్నింటిని పెండింగ్‌లో ఉంచుతున్నట్టు తెలిపింది. మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా విద్యార్థులంతా కలిసిమెలిసి ఉండాలని, కాషాయ టోపీలు, కండువాలు, హిజాబ్, స్కార్ఫ్‌లు, మతపరమైన జెండాలు తరగతి గదిలోకి తేవొద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు గురించి కోర్టుకు తెలుసునని, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత మరియు వ్యక్తిగత చట్టం యొక్క ముఖ్యమైన అంశాలు తీవ్రంగా చర్చించబడుతున్నాయని పేర్కొంది.
భారత దేశం.. బహు సంస్కృతులు, మతాలు, భాషలకు నిలయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనీ, లౌకిక రాజ్యంగా ఉండటం వల్ల అది ఏ మతంతోనూ తమను తాము గుర్తించుకోదనీ, ప్రతి భారతీయ పౌరుడికి తనకు నచ్చిన మత విశ్వాసాలను ప్రకటించే, ఆచరించే హక్కు ఉందని. అటువంటి హక్కు సంపూర్ణంగా ఉండకపోవడం భారత రాజ్యాంగం అందించిన సహేతుకమైన పరిమితులకు లోనవుతుందని అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తరగతి గదిలో హిజాబ్ ధరించడంపై లోతైన పరిశీలన చేయాలని ( రాజ్యాంగ పరంగా, మతపరంగా) హైకోర్టు పేర్కొంది.
మనది నాగరిక సమాజం, మతం, సంస్కృతి .. ప్రజల శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే ఏ చర్యను ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అంతులేని ఆందోళనలు మరియు విద్యా సంస్థలను నిరవధికంగా మూసివేయడం సంతోషకరమైన విషయాలు కాదు. ఉన్నత చదువుల్లో ప్రవేశానికి కాలక్రమం ఉన్నందున, విద్యా నిబంధనలను పొడిగించడం విద్యార్థులకు హానికరం అని హైకోర్టు పేర్కొంది.
ఆందోళనల కొనసాగింపు, దాని పర్యవసానంగా విద్యాసంస్థలను మూసివేయడం కంటే తరగతులకు తిరిగి రావడం ద్వారా విద్యార్థుల ఆసక్తి మెరుగ్గా ఉంటుందనీ, విద్యా సంవత్సరం త్వరలో ముగియనుంది. శాంతియుత వాతావరణంలో తరగతులు కొనసాగాలని అని హైకోర్టు సూచించింది.
మరోవైపు .. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వివాదంపై స్పందించిన సుప్రీంకోర్టు అత్యవసర విచారణను తిరస్కరించింది. తగిన సమయంలో మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని, ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తుది తీర్పు ఇచ్చే వరకు వేచి ఉండాలన్నారు. హిజాబ్ సమస్యను జాతీయ స్థాయి సమస్యగా చూడవద్దు. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. ఆలోచించండి, వీటిని ఢిల్లీకి తీసుకురావడం సరైనదేనా? జాతీయ స్థాయికి? ఏదైనా తప్పు ఉంటే, మేము హక్కులను పరిరక్షిస్తాము.. అని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కర్నాటకకు చెందిన ఓ అమ్మాయి సుప్రీంలో పిల్ దాఖలు చేసింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజురోజుకూ తీవ్రం కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు ఇతర క్యాంపస్‌లకు వ్యాపించాయి. హిజాబ్ ధరించిన ముస్లీం అమ్మాయిలను విద్యాసంస్థల్లోకి అనుమతించడంతో వివాదం తీవ్రమైంది.
