శబరిమల ఆయలంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై కర్ణాటక మహిళా మంత్రి జయమాల స్పందించారు. దేవుడికి, భక్తురాలికి మధ్యలోకి ఎవరూ రాలేరని ఆమె పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా శబరిమల ఆయంలోకి మహిళల  ప్రవేశంపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. కేవలం 50ఏళ్లు దాటిన మహిళలను మాత్రమే ఆయంలోకి అనుమతించేవారు. కాగా.. 1986లో రాజకీయనాయకురాలిగా మారిన సినీ నటి జయమల ఆయంలోకి ప్రవేశించారు.

అయితే..ఇది 2006లో వివాదంగా మారింది. ఆమె ఆలయంలోకి ప్రవేశించడం నేరమన్నట్టుగా అందరూ వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటి కేరళ ప్రభుత్వం మాత్రం శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని.. అందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. ఆ సమయంలో కొందరు మహిళలు ఆయంలో కి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు కూడా. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(  యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) వ్యతిరేకించింది.

దీంతో.. ఈ వివాదాం కోర్టు ముందుకు వచ్చింది.  ఈ కేసును పూర్తిస్థాయిలో పరిశీలించిన న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జయమాల హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పురుషులకు ఒకలాగా.. స్త్రీలకు మరోలాగా రాయలేదని ఆమె పేర్కొన్నారు. మహిళల విషయంలో చట్టం ఎప్పుడూ ఫెయిల్ అవ్వదని ఆమె అన్నారు. దేవుడికి, భక్తురాలికి మధ్యలోకి ఎవరూ రాలేరని ఆమె అభిప్రాయపడ్డారు.