Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభలో అవిశ్వాసంపై వాడీ వేడీ చర్చ: ఎవరేమన్నారు?

: కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై  శుక్రవారం నాడు చర్చ జరగనుంది. అవిశ్వాసంపై చర్చ విషయమై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే అవిశ్వాసం కారణంగా బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమైతే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

No-confidence motion in Parliament LIVE UPDATES: Lok Sabha to debate no-trust vote, Modi-led NDA confident of numbers

న్యూఢిల్లీ: కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై  శుక్రవారం నాడు చర్చ జరగనుంది. అవిశ్వాసంపై చర్చ విషయమై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే అవిశ్వాసం కారణంగా బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమైతే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము మద్దతును కూడగడుతున్నట్టు విపక్షాలు చెబుతున్నాయి.మరోవైపు ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదని  బీజేపీ నేతలు  ధీమాతో ఉన్నారు.

అయితే  టీఆర్ఎస్, బీజేడీలు తటస్థంగా ఉంటాయనే  ప్రచారం సాగుతోంది. శివసేన తమ పార్టీ వైఖరిని సభలోనే ప్రకటించనున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఈ అవకాశాన్ని  ప్రభుత్వంపై దాడి చేసేందుకు ఉపయోగించుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి..

*ఈ దేశాన్ని నందవనంగా మార్చే పరిస్థితులు కల్పించాలని ఫరూక్ కోరారు.

*దేశంలో గౌరవంగా బతికే పరిస్థితులు సృష్టించాలని ఆయన కోరారు.

*కాశ్మీర్ ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫరూక్ అబ్ధుల్లా ప్రకటించారు.

*నేను హిందూస్థానీ పాకిస్థానీ కాదని  నేషనల్ కాన్పరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.

*కాశ్మీర్ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్రం వైఫల్యం

*దేశంలో వడ్డీరేటు 6 శాతమే, ద్రవ్యోల్బణం కూడ 6 శాతమే అని చెప్పిన అసదుద్దీన్

*మూకదాడులు ఇప్పటివి కావని చెప్పిన అసదుద్దీన్

* కాశ్మీర్‌పై కేంద్రం పాలసీ ఏంటో చెప్పాలని ప్రశ్నించిన అసదుద్దీన్

‘* కేంద్రప్రభుత్వానికి ప్రశ్నలను సంధించిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ

*ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బుట్టా రేణుక

*ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా లేదని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుబట్టిన బుట్టా రేణుక

*ప్రధాని ఇచ్చిన హమీని అమలు చేయకపోతే పార్లమెంట్ వ్యవస్థకే నమ్మకంపోతోందన్న బుట్టా రేణుక

*పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారన్న టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు.

*ఆప్ ఎంపీ మోడీ పాలనపై వ్యంగ్య రూపంలో కవితను చదివి విన్పించారు.

*బీజేపీ పాలనలో ప్రజల జీవితాలు బాగుపడలేదని ఆప్ ఎంపీ విమర్శలు గుప్పించారు.

*అవిశ్వాసానికి ఆప్ మద్దతును  ఇస్తోందని  భగవంత్ ప్రకటించారు

*దీంతో ఆప్ ఎంపీభగవంత్ మన్  ను స్పీకర్ అవకాశం కల్పించారు.

*రామ్మోహన్ నాయుడు పదే పదే స్పీకర్ కోరినా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేదు

*ఏపీకి 5 శాతం నిధులు మాత్రమే ఇచ్చారన్న రామ్మోహన్ నాయడు

*విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం మోసం చేసిందన్న రామ్మోహన్ నాయుడు

*ప్రధానిగా ఎన్నికయ్యాక ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని మోడీ చెప్నిన విషయాన్ని ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు

*పార్లమెంట్ సాక్షిగా ఓ ప్రధాని ఇచ్చిన హమీలను మరో ప్రధాని విస్మరించారని విమర్శించిన రామ్మోహన్

*హమీల అమలుపై హోమ్ మంత్రి అబద్దాలు చెబుతున్నారన్న రామ్మోహన్

*ఏపీ విభజన చట్టం గురించి ప్రధాని, హోమ్ మంత్రి సమీక్షించారా అని ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు

*నాడు ఏపీకి ప్రత్యేక హోదాను జైట్లీ రాజ్యసభలో సమర్ధించారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

*ఏపీకి కేంద్రం ఇచ్చిన నిదుల గురించి మాట్లాడుతున్నారు. ఇవ్వాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు

*హరిబాబు విశాఖ నుండి ఎంపీగా ఎన్నికైనా ఢిల్లీ మాటలు మాట్లాడుతున్నారు.

*ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు

*విశాఖలో భూములున్నా ఎందుకు రైల్వేజోన్ ఏర్పాటు చేయలేదో చెప్పాలన్న రామ్మోహన్ నాయుడు

*బీజేపీ ఎంపీ హరిబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ  ఎంపీ రామ్మోహన్ నాయుడు

* కేంద్రం నిర్ణయం కారణంగా ఉన్నత చదువులు చదువుకొనేవారికి రాష్ట్రాలపై అదనపు భారం పడుతోందని జయవర్థనే చెప్పారు.

*అన్నాడిఎంకె ఎంపీ జయవర్థనే అవిశ్వాసం చర్చలో పాల్గొన్నారు.

*తెలుగు ప్రజల కోసం మోడీ పనిచేస్తున్నారని ప్రకటించిన హరిబాబు

*రాజకీయం కోసం  మీరు ఈ నిర్ణక్ష్ం తీసుకొన్నారని ప్రకటించిన హరిబాబు

* ఏపీకి అన్ని రకాల సహాయం చేసినందుకు కేంద్రం ముందుకు వచ్చినందుకే అవిశ్వాసం ప్రతిపాదించారా ప్రశ్నించిన హరిబాబు

*విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించి త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనున్నట్టు హరిబాబు చెప్పారు

*కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కమిటీ నివేదిక ఇచ్చింది. అందుకే టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేశామన్న హరిబాబు

*అకౌంట్ నెంబర్ ఇస్తే సోమవారం నాడే నిదులు ఇస్తామన్న హరిబాబు

*ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఆర్ధిక సాయం చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్న హరిబాబు

*పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి... ఈ ప్రాజెక్టును మేం పూర్తి చేస్తామని ప్రకటించిన హరిబాబు

*పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం తెలంగాణ నుండి 7 మండలాలను ఏపీలో విలీనం చేసినట్టు హరిబాబు గుర్తు చేశారు.

*హోదా పేరు లేకున్నా ఏపీకి అన్ని రకాల నిధులు అందిస్తున్నట్టు ప్రకటించిన హరిబాబు

*మీకు పేరు కావాలా.... ఏపీ రాష్ట్రానికి నిధులు కావాలో చెప్పాలని డిమాండ్ చేసిన హరిబాబు

*ఆర్థిక వెసులుబాటు కోసం కేంద్రం రూ.17,500 రుణంగా ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. ఈ రుణాన్ని కూడ కేంద్రం భరించేందుకు సిద్దంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన హరిబాబు

*14వ, ఫైనాన్స్ కమిషన్ కూడ రెవిన్యూలోటును భర్తీ చేయాలని చెప్పింది, దానికి అనుగుణంగా ఏపీకి నిధులు ఇస్తున్నట్టు ప్రకటించిన హరిబాబు

*కాంగ్రెస్ పార్టీ నేతలతో టీడీపీ నేతలు సమన్వయం కోసం ప్రయత్నం చేయడం తాను చేసినట్టు ప్రకటించిన హరిబాబు

*హరిబాబు ప్రసంగానికి అడ్డుపడుతున్న టీడీపీ

*ఏపీపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్న హరిబాబు

*రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి విభజనను తప్పు పడుతోందన్న హరిబాబు

*ఏపీని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించిన హరిబాబు

*ఏపీపై కాంగ్రెస్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదో చెప్పాలన్న హరిబాబు

*కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలపడం ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్దమన్న హరిబాబు

*ఇవాళ టీడీపీ తీసుకొన్న నిర్ణయం ఏపీకి నష్టమన్న హరిబాబు

*మీరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకొనే హక్కు ఉందని హరిబాబు చెప్పారు.

*కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ప్రారంభించిన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్న హరిబాబు

* కాంగ్రెస్ ను టీడీపీ నేతలు నమ్ముతున్నారని హరిబాబు విమర్శించారు.

*కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు.

*గందరగోళం మధ్యే హరిబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

* మల్లిఖార్జున ఖర్గే ప్రసంగం పూర్తి చేయకపోవడంతో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును ప్రసంగించాలని కోరిన స్పీకర్

*రైతుల నుండి భీమా కంపెనీలకు వందల కోట్లు జమ చేసినా.. రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు.

*ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుండి వంద కోట్లను ఖర్చు చేసేందుకు కూడ బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఖర్గే ఆరోపించారు.

*ఆదానీ, అంబానీ గురించి మోడీ ప్రభుత్వం పట్టించుకొంటుంది ,కానీ, రైతుల గురించి పట్టించుకోవడం లేదన్న ఖర్గే

*రైతల కోసం సంక్షేమ కార్యక్రమాలు,ఎంఎస్‌పీ ఇస్తే ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ప్రశ్నించిన ఖర్గే

*దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

*ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ఉన్న విషయాన్ని ప్రస్తావంచిన ఖర్గే

*నాడు ప్రధాని ఇచ్చిన హమీని నెరవేర్చాల్సిన అవసరం ఉందన్న ఖర్గే

*ఏపీ ప్రజల కోసం  మేం అవిశ్వాసానికి మద్దతు ఇచ్చామని ఖర్గే ప్రకటించారు.

*2014 ఫిబ్రవరిలో అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ ఈ ఐదు అంశాల గురించి ప్రస్తావించారని చెప్పారు.

*యూపీఏ ప్రభుత్వం ఏపీ రాష్ట్రం కోసం పొందుపర్చిన అంశాలను ఖర్గే గుర్తు చేశారు.

*ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ మాత్రమేనని ఖర్గే చెప్పారు

*ఆర్ఎస్ఎస్ గురించి ఖర్గే ప్రస్తావించిన సమయంలో అడ్డుకొన్న బీజేపీ సభ్యులు

*బుద్ధుడు, అంబేద్కర్, బసవేశ్వర్ సిద్దాంతాలకు విధానాలకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్నారు

*ఇలానే పరిస్థితి కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని ఖర్గే అభిప్రాయపడ్డారు.

*దేశానికి మోడీ నాలుగేళ్లలో ఏం చేశారని ప్రశ్నించిన ఖర్గే

*శంభూక్ గురించి పురాణాల గురించి మాట్లాడిన నేతలకు గుర్తుకు లేదా అని ఆయన ప్రశ్నించారు.

*కొందరు వక్తలు రామాయణం, మహాభారతం గురించి చేసిన ప్రసంగాన్ని ఖర్గే ప్రస్తావించారు.

*పాశ్వాన్ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే చర్చలో పాల్గొన్నారు.

*కేంద్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వాల గురించి పాశ్వాన్ ప్రస్తావించారు.

*లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్, కేంద్ర మంత్రి అవిశ్వాసంపై ప్రసంగించారు.

*బీహార్‌కు ప్రత్యేకహోదా లేదా ప్యాకేజీ ివ్వాలని కోరిన తారిఖ్ అన్వర్

*రాజ్‌నాథ్‌సింగ్ తర్వాత ఎస్పీపీ నేత తారిఖ్ అన్వర్ అవిశ్వాసంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.

*ఏపీ, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటామని ప్రకటించిన రాజ్‌నాథ్ సింగ్

*ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులున్నాయన్న రాజ్‌నాథ్ సింగ్

*స్పెషల్ స్టేటస్ ప్రొవిజన్ లేదన్న రాజ్‌నాథ్ సింగ్

*ఏపీకి అన్ని రకాలుగా సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించిన రాజ్‌నాథ్

*గల్లా జయదేవ్ ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన రాజ్‌నాథ్ సింగ్

*2015-15 లో రెవిన్యూలోటు కింద రూ.4,117 కోట్లు ఇచ్చినట్టు ప్రకటించిన రాజ్‌నాథ్ సింగ్

* ఏపీ విబజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేసినట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు.

‘ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.1500 కోట్లు ఇచ్చినట్టు ప్రకటించిన రాజ్‌నాథ్

*ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు

*పోలవరానికి రూ.6750 కోట్లు ఇచ్చినట్టు రాజ్ నాథ్

*గుంటూరు, విజయవాడ నగరాలకు వెయ్యి కోట్లు ఇచ్చినట్టు రాజ్‌నాథ్ సింగ్

‘*14వఫైనాన్స్ కమిషన్‌లో ప్రత్యేక హోదా అంశం లేదన్న రాజ్‌నాథ్

* ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పిన రాజ్‌నాథ్

‘‘ఏన్డీఏ నుండ బాబు వెళ్లినా బాబు మిత్రుడేనని చెప్పిన రాజ్ నాథ్

*చంద్రబాబునాయుడు ఇప్పటికీ మాకు మిత్రుడేనన్న రాజ్‌నాథ్ సింగ్

*పఠాన్‌కోట్ లాంటి ఘటనల్లో జవాన్లు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను మట్టుబెట్టారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు.

*నాలుగేళ్లలో దేశంలో ఉగ్రవాదుల ఘటనలు కానీ, మావోయిస్టుల ఘటనలు చోటుచ ేసుకోలేదన్నారు

*ఈశాన్య రాష్ట్రాల్లో కూడ శాంతి వెల్లివిరుస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

*ఒక ఛాయ్‌వాలా భారత్‌కు ప్రధానిగా ఎన్నికయ్యారని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. 

*పెద్ద నోట్ల రద్దు తర్వాత యూపీలో బీజేపీని ప్రజలు గెలిపించారన్న రాజ్ నాథ్ 

*సభ హుందాతనాన్ని కాపాడాలని కోరిన స్పీకర్

*రాహుల్‌ తీరును స్పీకర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు చురకలు

*టీడీపీ ఎంపీలను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీలు

*'సభలో రాహుల్ ప్రవర్తనను తప్పుబట్టిన స్పీకర్

*  సభ గౌరవాన్ని కాపాడాలని కోరిన స్పీకర్

*పార్లమెంట్‌లో ప్రధాని ఉన్న సమయంలో కనీసం నియమనిబంధనలను పాటించాలని కోరిన స్పీకర్

*పార్లమెంట్‌ను సాయంత్రం నాలుగున్నర గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్

*స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన, గందరగోళం

*ఏపీ సమస్యలపై ప్రస్తావించాలని పోడియం వద్దకు టీడీపీ ఎంపీల ఆందోళన

*దేశానికి హోం మంత్రి అని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు

*ఏపీ సమస్యలు మాట్లాడాలని కోరిన టీడీపీ ఎంపీలు

*మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ మెంబర్‌షిస్ ను నాలుగేళ్లలో ఇండియా పొందిందని రాజ్ నాథ్ గుర్తుచేశారు.

*నాలుగేళ్ల కాలంలో దేశంలో అనేక మొబైల్ కంపెనీలు ఏర్పాటయ్యాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

*ప్రపంచంలో మోడీ దేశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేసిన రాజ్‌నాథ్ సింగ్

*మోడీ తిరుగులేని జనాకర్ణక నేతగా అభివర్ణించిన రాజ్‌నాథ్ సింగ్

*అతి విశ్వాసం ఎప్పుడూ కూడ పనిరాదన్న రాజ్‌నాథ్ సింగ్

*భారత ప్రతిష్టను మోడీ ముందుకు తీసుకెళ్లారని చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

*బీజేపీ అనేక ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. ఊహించని ప్రాంతాల్లో కూడ బీజేపీ విస్తరించిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్ నాథ్ 

*యూపీఏ పదేళ్లు అధికారంలో ఉంటే మేం అవిశ్వాసం పెట్టలేదని రాజ్‌నాథ్ గుర్తు చేశారు

*15 ఏళ్ల తర్వాత అవిశ్వాసంపై చర్చ జరుగుతోందన్న రాజ్‌నాథ్

*అతివిశ్వాసం ఎప్పుడూ కూడ మంచిదికాదని చెప్పిన రాజ్ నాథ్

*ఏన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉందని ప్రకటించిన రాజ్‌నాథ్ సింగ్

*ప్రభుత్వానికి వ్యతిరేక్ంగా విపక్షాలు ఏకమయ్యాయని రాజ్‌నాథ్ విమర్శలు

*కేరళ, త్రిపుర, లడఖ్‌లలో కూడ బీజేపీ పుంజుకొంటుందని చెప్నిన రాజ్ నాథ్ సింగ్

*త్రిపురలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న సీపీఎంను కాదని బీజేపీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

* రెండు స్థానాల నుండి దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన రాజ్ నాథ్ సింగ్

*కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అవిశ్వాస తీర్మాణంపై చర్చలో పాల్గొన్నారు.

*ప్రభుత్వంపై సలీం విమర్శలు గుప్పించారు.

*అన్ని రంగాల్లో ఎప్‌డీఐలకు తలుపులు తెరిచారని సలీం విమర్శించారు

*బీజేపీ చెబుతున్న లెక్కల్లో ప్రగతి లేదన్నారు.

*టీడీపీకి మేం మద్దతుగా నిలుస్తున్నామని సీపీఎం నేత సలీం చెప్పారు.

*ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హమీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయలేదు

*పెద్ద నోట్ల రద్దు అనేది పెద్ద ఆర్ధిక మాయ అని సలీం విమర్శలు గుప్పించారు

*2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలను కల్పించారో చెప్పాలన్న సలీం

*నోట్ల రద్దు వల్ల నల్లధనం నిర్మూలన చేస్తామని మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు.

* నల్లధనాన్ని విదేశాల నుండి తీసుకొస్తానని మోడీ తన మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు.

*'సీపీఎం నేత సలీం అవిశ్వాసంపై చర్చించారు

*రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని ములాయం విమర్శలు చేశారు.

* ఎన్యికల్లో ఇచ్చిన ఒక్క హమీని కూడ ఎన్డీఏ నెరవేర్చలేదన్న ములాయం

*రైతుల ఆత్మహత్యలను కేంద్రం సరైన దిశలో పరిష్కరించడం లేదని ములాయం విమర్శలు

*యూపీలో బీజేపీకి ఓటేసీని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ములాయం

*యూపీలో, కేంద్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాాలు నడుస్తున్నాయని ములాయం సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

*యువతకు ఉపాధి కల్పించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని ములాయం సింగ్

*రైతులు, యువకులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న ములాయం సింగ్

* సమయం ముగిసినందున  సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంను ప్రసంగించాలని కోరిన డిప్యూటీ స్పీకర్ తంబిదురై

* ప్రత్యేక హోదా అంటే ఏమిటో చెప్పాలని రాహుల్ ను ప్రశ్నించిన వినోద్

* ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేయాలని వినోద్ డిమాండ్

*మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కోరినా కానీ, ఒక్క పైసా కూడ కేంద్రం నుండి రాలేదన్నారు.

*హైకోర్టు జడ్జిల్లో ఎక్కువ మంది జడ్జిలు తమ ప్రాంతానికి చెందినవారు కాదని వినోద్ గుర్తు  చేశారు.

*హైకోర్టు భవనం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని వినోద్ కోరారు

* తక్కువ కాలంలోనే అసెంబ్లీ, సచివాలయాన్ని నిర్మాణం చేసిన విషయాన్ని వినోద్ గుర్తు చేశారు.

* ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు

*హైకోర్టు విభజన పూర్తి కాకపోవడానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కారణమన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్

*హైకోర్టు విభజనను ఇంకా పూర్తి చేయలేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ గుర్తు చేశారు

*బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హమీని నెరవేర్చలేదన్నారు వినోద్

*గిరిజన యూనివర్శిటీని తెలంగాణకు ఇవ్వలేదన్నారు వినోద్

*సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకి లాక్కొన్నారన్న వినోద్

*ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేసిన వినోద్

*విభజన చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్న వినోద్

*ఏపీలో కలిపిన 7 మండలాలను తెలంగాణలో కలపాలన్న వినోద్

*మోడీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందన్న వినోద్

*తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏనాడూ కూడ క్షమించరని చెప్పారు.

*7మండలాలను ఏపీలో కలపకపోతే నేను ప్రమాణస్వీకారం చేయనని బాబు చెప్పిన మాటలను వినోద్ ెప్పారు.

*ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను ఏపీలో కలపడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించామన్నారు

*అయితే ఈ ఆర్డినెన్స్ ను మేం వ్యతిరేకించాం

*వినోద్ ప్రసంగంపై  గల్లా జయదేవ్ అభ్యంతరం చెప్పారు

*ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చారు.

*టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అవిశ్వాసంపై చర్చలో పాల్గొన్నారు.

*తమిళనాడుకు కేంద్రం పెండింగ్ నిధులను ఇవ్వాలని లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

*కేంద్రం మాపై సవతితల్లి ప్రేమ చూపుతోందని వేణుగోపాల్ విమర్శించారు.

*ఫైనాన్స్ కమిషన్లు  తమిళనాడుపై వివక్ష చూపుతున్నాయన్న అన్నాడీఎంకె ఎంపీ వేణుగోపాల్

* అభివృద్ధి చెందుతున్న తమిళనాడుపై 

*కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేదన్నారు

* వేణుగోపాల్ ప్రసంగాన్ని ప్రసంగించిన కొంత సేపటి తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ బయటకు వెళ్లారు. ఛైర్మెన్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉన్నారు.

*సభలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత వేణుగోపాల్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

*సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో చాలాసేపు వేణుగోపాల్ ప్రసంగించడానికి లేచి నిల్చున్నాడు

* ఈ సమయంలో అన్నాడీఎంకె సభ్యుడు వేణుగోపాల్‌ను చర్చలో పాల్గొనాలని కోరిన స్పీకర్ సుమిత్రా మహాజన్

*కొద్దిసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది

*రాహుల్ ను మున్నాభాయ్ తో పోల్చిన హర్‌ప్రీత్ కౌర్

*సభలో కొందరు సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్  ను లేవనెత్తారు.

*దీంతో సభ్యులు శాంతించలేదు

*ఫ్రాన్స్‌తో ఒప్పందం వివరాలను సభలో ఉంచిన నిర్మలా సీతారామన్

*రాహుల్ గాంధీకి, ఫ్రాన్స్ అద్యక్షుడికి మధ్య ఏం జరిగిందో తెలియదన్న నిర్మలా సీతారామన్

*భారత్, ఫ్రాన్స్ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాలని ఉందన్న నిర్మలా సీతారామన్

*రాహుల్ ప్రసంగంలో రాఫెల్ కుంభకోణంపై ప్రస్తావించడంతో నిర్మలా సీతారామన్ కు అవకాశం కల్పించారు

*ప్రసంగిం ముగించిన తర్వాత రాహుల్ గాంధీ వెళ్లి మోడీతో కరచాలనం చేశారు

*నాకు మీమీద కోపం లేదన్న రాహుల్ గాందీ

*నేను బాగా మాట్లాడానని బీజేపీ సభ్యులు తనను బయట అభినందిస్తారన్న రాహుల్

*నన్ను ఓ పప్పుగా మీరు అంటారన్న రాహుల్

*నాపై మీకు ద్వేషం ఉందన్న రాహుల్

*శత్రువును కూడ ప్రేమించాలని నాకు మిమ్మల్ని చూశాకే తెలిసింది.

*కానీ, అధికారంలో లేకుండా మోడీ, అమిత్ షా ఉండరని చెప్పారు.

*అధికారంలో ఉండడం లేకపోవడం మాకు మామూలేనన్న రాహుల్

*ఆర్ఎస్ఎస్ పేరు తేవద్దన్న స్పీకర్

*ప్రధాని, ఆర్ఎస్ఎస్ వల్ల తనకు కాంగ్రెస్ గొప్పతనం తెలిసిందన్న రాహుల్

*ప్రధాని, అమిత్ షా ప్రత్యేక తరహ నేతలు

*కథువాలో అత్యాచార నిందితులకు మద్దతుగా బీజేపీ మంత్రులు ర్యాలీ నిర్వహించారని గుర్తు చేసిన రాహుల్

*హిందూస్థాన్‌లో మహిళలకు రక్షణ లేదని ఓ పత్రికలో వచ్చిన ఆర్టికల్ ను ప్రస్తావించిన రాహుల్

*దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న రాహుల్

*కొద్దిరోజుల కిందట మద్దతు ధర పేరుతో గారడీ చేశారని బీజేపీపై రాహుల్ విసుర్లు

*మహిళలు, దళితులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ప్రధాని నోరు మెదపరని ప్రశ్నించిన రాహుల్

*రాహుల్ ప్రసంగం తర్వాత నిర్మలా సీతారామన్ కు అవకాశం కల్పిస్తానన్న స్పీకర్

*రాహుల్ అంగీకరిస్తే నిర్మలా సీతారామన్ కు వెంటనే అవకాశం ఇస్తానన్న స్పీకర్

*ఆరోపణలకు గురైన వారు సమాధానం చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తానన్న స్పీకర్

*ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరు ప్రస్తావించకూడదని  రాహుల్ కు సూచన

* అధికార, విపక్షాలు సహకరించుకొంటూ వెళ్లాలన్న స్పీకర్

*తిరిగి ప్రారంభమైన సభ

* దీంతో సభను మధ్యాహ్నం1.45వాయిదా వేసిన స్పీకర్

* సభలో తీవ్ర గందరగోళం

* రాహుల్ విమర్శలపై బీజేపీ నేతల అభ్యంతరం

* దేశం

వాయిదాలో కార్పోరేటు కంపెనీల రుణాలను మాఫీ చేశారు. కానీ, రైతుల రుణాలను మాఫీ చేయలేదని మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు

* చైనాకు ఆ దేశాధ్యక్షుడు తిరిగి వెళ్లగానే డోక్లాంలో ఆ దేశ సైనికులు  దాడికి దిగితే మన సైనికులు ధైర్యంగా  ఎదిరించారన్న రాహుల్

* చైనా అధ్యక్షుడు, ఉయ్యాల ఊగారనన్నారు

* నేను చేసిన విమర్శలను  దేశం చూస్తోందన్న రాహుల్

* మోడీ దేశానికి కాపలాదారు కాదన్నారు. పలాయనవాదిా పేర్కొన్నారు.

* మోడీ అబద్దం చెబుతున్నారు.. అందుకే నా కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నారని ప్రకటించిన రాహుల్

* ప్రధాని నవ్వుతున్నా ఆయన మనసులో ఆందోళన కన్పిస్తోందన్న రాహుల్

* రాఫెల్ స్కామ్ లో రూ45వేల కోట్లు ఓ సంస్థకు ప్రయోజనం కల్గించేలా మోడీ వ్యవహరించారన్నారు.

* రూల్స్ ను చదివి విన్పించిన మంత్రి అనంతకుమార్

* రాహల్ ప్రసంగంపై పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి అనంతకుమార్ అభ్యంతరం

* కొన్ని పారిశ్రామిక సంస్థలకు లాభం చేయడానికే రాఫెల్ డీల్ అని చెప్పిన రాహుల్

* భారత్- ఫ్రాన్స్ ఒప్పందంలో ఎలాంటి రహస్యం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనకు చెప్పారన్న రాహుల్

:* రాఫెల్ స్కామ్ గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాను.

* రాఫెల్ స్కామ్‌పై ప్రధాని ఒత్తిడితో నిర్మలా సీతారామన్ అబద్దాలు చెప్పారన్న రాహుల్ గాందీ

:* దేశానికి ప్రధానిని కాదు, దేశానికి నౌఖరుగా మోడీ చెప్పుకొన్నారని రాహుల్ విమర్శలు

*రాఫెల్ కుంభకోణంపై రాహుల్ విమర్శలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం

*రాఫెల్ కుంభకోణాన్ని రాహుల్ ప్రస్తావించిన సమయంలో ఆగష్టా కుంభకోణాన్ని ప్రస్తావించిన బీజేపీ ఎంపీలు

*రాఫెల్ కుంభకోణాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ

*ఎవరి పేర్లు తీసుకురావద్దని సూచించిన స్పీకర్ సుమిత్రా మహాజన్

*అమిత్ షా కొడుకు జై షా పేరును ప్రస్తావించిన రాహుల్ గాంధీ , అభ్యంతరం చెప్పిన బీజేపీ ఎంపీలు

*మోడీ గుండెల్లో పేదలుకు చోటు లేదని రాహుల్ విమర్శ

*పేదల కోసం మోడీ ఏ కార్యక్రమం చేపట్టలేదు

*గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని మోడీ  వ్యతిరేకించారన్న రాహుల్

*మోడీ ఐదు రకాల జీఎస్టీలు తెచ్చారని ఎద్దేవా చేసిన రాహుల్

*రాహుల్ విమర్శలు చేస్తున్న సమయంలో ముసి ముసి నవ్వులు నవ్విన మోడీ

*నోట్ల రద్దు ఆలోచన లేకుండా తీసుకొన్న నిర్ణయమని రాహుల్ గాంధీ విమర్శలు

* నోట్ల రద్దుతో తాము తీవ్రంగా గాయపడ్డారని సూరత్ వ్యాపారులు చెప్పారన్న రాహుల్ గుర్తు చేశారు.

*రెండు కోట్ల మందికి ఉద్యోగాలేమయ్యాయన్న రాహుల్

*ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో  15 లక్షల నిధులను ఇస్తామని మోడీ చెప్పారు.

*గారడీ మాటలతో దేశ రైతులు నష్టపోయారు.

*గల్లా జయదేవ్ ప్రసంగంలో బాధ కన్పించింది.

*ఏపీ 21వ శతాబ్దపు రాజకీయ బాధిత రాష్ట్రమన్న రాహుల్

*నేను ఇద్దరు ఎంపీల ప్రసంగాలు విన్నానన్న రాహుల్

*కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ప్రారంభించారు.

*కవితతో తన ప్రసంగాన్ని ముగించిన రాకేష్ సింగ్

* బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని  ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం

*దేశంలో బీజేపీ నేతృత్వంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్న ఎంపీ రాకేష్ సింగ్

*యూపీఏ పాలనలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు అందేవి కావన్న బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్

*అంచనాలు, వాస్తవికత మధ్య తేడా తగ్గిందన్న రాకేష్ సింగ్

*పరస్పరమైన విరుద్ధమైన శక్తులు ముందుకు వచ్చి అవిశ్వాసాన్ని ప్రతిపాదించాయన్న రాకేష్ సింగ్

*బీజేపీ ఈ దేశానికి సుపరిపాలనను అందిస్తోందన్న రాకేష్ సింగ్

*మోడీ తీసుకొన్న చర్యలతో ఇండియా ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానానికి చేరుకొందన్న రాకేష్ సింగ్

*అందరీకీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం బీజేపీది

*70 ఏళ్లలో లేని అభివృద్ధిని మోడీ నాలుగేళ్లలో చేశారు.

*దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అాదికారంలో ఉంది

*దేశంలోని పేదలకు ఆరోగ్యభద్రత కల్పిస్తున్నామన్న రాకేష్ సింగ్

*కాంగ్రెస్ హయంలో స్కాంలతో దేశ ప్రతిష్ట దెబ్బతింది.

*మోడీ దేశానికి దశ, దిశ అందిస్తున్నారన్న రాకేష్ సింగ్

*మోడీ నేతృత్వంలో భారత్ అగ్రరాజ్యంగా నిలుస్తోందన్న రాకేష్ సింగ్

*ప్రత్యేక హోదాపై ఎక్కువగా ప్రస్తావించని బీజేపీ

*కర్ణాటక సీఎంను చూస్తే జాలేస్తోంది

*ఏడాదిలోనే ప్రతి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాం

*కాంగ్రెస్ హాయంలో దేశంలో అనేక కుంభకోణాలు బయటకు వచ్చాయి.

*కాంగ్రెస్ వైపు చేరినప్పుడే శాపగ్రస్తులైపోయారని టీడీపీ నేతలపై రాకేష్ సింగ్ విమర్శలు.

*గల్లా జయదేవ్ ప్రసంగం చూస్తే అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

* బీజేపీ ఎంపీ రాకేష్ సింహ అవిశ్వాసం చర్చలో పాల్గొన్నారు.

*ప్రధానిని మోసగాడు అనే మాటలను రికార్డుల నుండి తొలగించాలని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్.

*గల్లా జయదేవ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కోరిన జితేందర్ రెడ్డి

*తెలంగాణ బిల్లు ఎలా అశాస్త్రీయమైందని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు.

*కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించారు.

*విద్యార్ధులు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకొన్నారని జితేందర్ ప్రస్తావించారు.

*2009లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందన్న జితేందర్ రెడ్డి

*టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు

*ఏపీకి ఇచ్చిన నిధులు బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్ల కంటే తక్కువ

*రాష్ట్ర విభజనను కించపర్చే వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి అభ్యంతరం

*బీజేపీ ఏపీలోని ప్రత్యర్ధి పార్టీలతో కుమ్మకైంది.

*అందుకే ఎన్డీఏ నుండి బయటకు వచ్చాం

*నాలుగేళ్లుగా మేం ఎదురుచూశాం. కానీ, మాకు న్యాయం చేయలేదు

*ఢిల్లీ, షాంఘై లాంటి రాజధాని నిర్మాణానికి సహకరిస్తామన్న మోడీ నిధులు ఎందుకు కేటాయించలేదు.

*15వందల కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా పూర్తవుతోంది

*అమరావతికి రూ1500 కోట్ల నిధులు ఇచ్చి చాలా నిధులు ఇచ్చినట్టు అవుతోందా అని ప్రశ్నించిన గల్లా

*ఏపీకి లక్షకోట్లకు పైగా నిధులు అడిగితే రూ.13వేల కోట్లు ఇచ్చారు

*ప్రసంగాన్ని ముగించాలని గల్లా జయదేవ్ ను కోరిన  స్పీకర్

*అమరావతికి 43వేల కోట్లు కేటాయించాలన్న గల్లా

*ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కనీసం నిధులు కూడ కేటాయించడం లేదు

*విగ్రహాలు వందల కోట్లు కేటాయిస్తున్నారు.

*ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులను ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోంది.

*ఏపీ బీజేపీ నేతలు ఏపీకి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న గల్లా

*కేంద్రం తీరు సిగ్గు చేటుగా ఉంది

*10 నెలల రెవిన్యూలోటు 16 వేల కోట్లైతే, కేంద్రం రూ.7 వేల కోట్లుగా లెక్కలు తీసింది.

*బుందేల్‌ఖండ్‌తో పోలిస్తే ఏపీకి ఇచ్చిన నిధులు పదోవంతు కూడ లేవు.

*మాకిచ్చిన వెయ్యి కోట్లలో ఇప్పటికే 900 కోట్లు ఖర్చు చేసి యూసీలు ఇచ్చాం

*కేంద్రం చేసిన మోసాన్ని గ్రహించే చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు.

*దేశంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చింది

* యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు

*చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నాడని విపక్షాలు ఏపీలో విమర్శలు చేస్తున్నారు

*ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం మోసం చేసింది.

* చేతులు జోడించి కోరుతున్నా.. ప్రత్యేక హోదాను ప్రకటించాలని మోడీని, ఆర్థిక మంత్రిని కోరుతున్నా

*ఆర్థికమంత్రి అబద్దాలు చెప్పడం మానుకోవాలన్న గల్లా జయదేవ్

* మరో 5 నిమిషాలు సమయం ఇచ్చిన స్పీకర్

* అరగంట సమయం కోరిన గల్లా జయదేవ్

* త్వరగా ప్రసంగం ముగించాలని గల్లాను కోరిన స్పీకర్

 *ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదు.

*ఆర్టికల్ 4 ప్రకారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు

*బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొన్నట్టుగా గుర్తు చేసిన గల్లా జయదేవ్

*గల్లా ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్న మోడీ

*ఏపీని అన్నిరకాలుగా మోసం చేసిన బీజేపీకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు.

*కాంగ్రెస్ పార్టీ తెలుగుతల్లిని రెండు ముక్కలు చేసింది

*అవినీతిపరులకు మోడీ మద్దతుగా నిలుస్తున్నారు.

*స్కీమ్ ఆంధ్రా కావాలా, స్కామాంధ్రా కావాలా అని మోడీ చేసిన  ప్రసంగాన్ని కోరిన గల్లా జయదేవ్

*పార్లమెంట్‌లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరిన గల్లా జయదేవ్

*ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన గల్లా జయదేవ్

* విద్యుత్ కేటాయింపులు జనాభా ప్రకారం సాగడంతో ఏపీ నష్టపోయింది.

* హైద్రాబాద్ ను కోల్పోవడంతో ఏపీ సంపదను కోల్పొయింది

* హైద్రాబాద్‌ను అందరూ కలిసి అభివృద్ధి చేశారు

*విభజనతో 90 శాతం విద్యాసంస్థలు తెలంగాణకు వెళ్లాయి

*ఏపీకి కేంద్రం ప్రకటించిన జాతీయ ప్రాజెక్టులు నత్తనడకనత సాగుతున్నాయి.

*షెడ్యూల్ 9లోని కంపెనీలకు ఏపీకి కేటాయించలేదు

*అప్పులు ఏపీకి, ఆస్తులు తెలంగాణకు ఇచ్చారన్న గల్లా

*రెండు జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయన్న గల్లా జయదేవ్

*మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడాలని కోరిన టీఆర్ఎస్ ఎంపీలను కోరిన స్పీకర్

*అనాలోచిత నిర్ణయం కారణంగా ఏపీ రాష్ట్రం నష్టపోయింది

*టీఆర్ఎస్ ఎంపీలు పోడియం వద్దకు వచ్చి నిరసన

*గల్లా జయదేవ్ ప్రసంగానికి టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

*టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

*తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు.

* రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అభ్యంతరాలు

*గల్లా జయదేవ్ ప్రసంగానికి టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

*టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం

*తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు.

*ఏన్డీఏ నుండి బయటకు రాగానే మాపై కక్ష గట్టారు

*ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవాలని కోరిన గల్లా

*ఇది ధర్మయుద్దమన్న గల్లా జయదేవ్

*ఇది మెజారిటీకి మోరాలిటీకి మధ్య జరిగే యుద్దం

* ఇది పార్లమెంట్ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు

* తెలుగు సినిమా భరత్ అనే నేను సినిమా స్టోరీని చెప్పిన గల్లా జయదేవ్

* అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా మద్దతిచ్చిన పార్టీలకు గల్లా జయదేవ్ ధన్యవాదాలు తెలిపారు.

* తనకు అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబునాయుడకు, కేశినేని నానికి ధన్యవాదాలు తెలిపారు.

*గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మాణంపై చర్చను ప్రారంభించారు

*కేంద్రంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాణాన్ని లోక్‌సభలో ప్రారంభించారు.

*అవిశ్వాసంపై తాము చర్చలో పాల్గొనబోమని బీజేడీ ప్రకటించింది. సభ నుండి బీజేడీ సభ్యులు వాకౌట్ చేశారు.

*యూపీఏ, ఎన్డీఏ ఒడిశా ప్రజలకు న్యాయం చేయలేదు

*సమయం పరిమితం చేయొద్దని ఖర్గే స్పీకర్ ను కోరారు.మూడు రోజుల పాటైనా చర్చించాలని కోరారు.

*అవిశ్వాసంపై  కేటాయించిన సమయంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అభ్యంతరం

*అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత మోడీ సమాధానం చెబుతారు

*సాయంత్రం ఆరుగంటలకు ఓటింగ్

*పార్టీల బలాల ఆధారంగా సభ్యులకు మాట్లాడేందుకు సమయం కేటాయింపు

*ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

*పార్లమెంట్ భవనం వద్ద విక్టరీ సింబల్ చూపిన బీజేపీ నేత అమిత్ షా, కేంద్ర మంత్రి అనంత్ కుమార్
*ఢిల్లీలో భారీ వర్షం

* మంత్రులతో ప్రధాని మోడీ సమావేశం

*అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్న టీడీపీ  ఎంపీ గల్లా జయదేవ్

*పార్లమెంట్‌కు చేరుకొన్న బీజేపీ ముఖ్య నాయకులు

*శివసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం
*అవిశ్వాసానికి దూరంగా ఉండాలని శివసేన నిర్ణయం

 

Follow Us:
Download App:
  • android
  • ios