Asianet News TeluguAsianet News Telugu

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం

సీఎంగా  ఏడోసారి నితీష్ కుమార్ సోమవారం నాడు సాయంత్రం ప్రమాణం చేశారు. గవర్నర్ ఫగ్ చౌహన్  నితీష్ కుమార్ తో ప్రమాణం చేయించాడు. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.
 

Nitish Kumar takes oath as the CM of Bihar for the seventh time lns
Author
Patna, First Published Nov 16, 2020, 4:49 PM IST

బీహార్ సీఎంగా  ఏడోసారి నితీష్ కుమార్ సోమవారం నాడు సాయంత్రం ప్రమాణం చేశారు. గవర్నర్ ఫగ్ చౌహన్  నితీష్ కుమార్ తో ప్రమాణం చేయించాడు. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.

ఎన్డీఏ శాసనసభపక్ష నేతగా ఈ నెల 15వ తేదీన నితీష్ కుమార్ ఎన్నికయ్యాడు. తనకు మద్దతిస్తున్న పార్టీల లేఖలను నితీష్ కుమార్ ఆదివారం నాడు గవర్నర్ కు  సమర్పించారు.

బీహార్ లోని కటియార్ నుండి వరుసగా నాలుగు దఫాలు ఎన్నికైన తరి కిషోర్ ప్రసాద్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా ఆదివారం నాడు ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే.

 

రేణుదేవికి నితీష్ కుమార్ తన కేబినెట్లో చోటు కల్పించారు. 2010 ఉప ఎన్నికల తర్వాత ఆమెకు కేబినెట్ లో చోటు కల్పించారు. చంపాపురంలోని బెట్టియా నుండి ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రేణు దేవికి కూడ నితీష్ కుమార్ డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఈ దఫా ఇద్దరు డిప్యూటీ సీఎంలు నితీష్ కేబినెట్లో ఉంటారు.

ప్రస్తుతం నితీష్ కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బిజేంద్ర ప్రసాద్ కు మరోసారి మంత్రి పదవి దక్కింది. సరైరంజన్ ఎమ్మెల్యే  విజయ్ కుమార్ కు నితీష్ కేబినెట్ లో చోటు దక్కింది. 2015లో ఆయన స్పీకర్ గా కొనసాగారు.ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

నితీష్ తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుండి ఏడుగురు, జేడీ(యూ) నుండి ఐదుగురికి కేబినెట్ లో చోటు దక్కింది. హెచ్ఏఎం, వీఐపీలకు చెరో మంత్రి పదవి దక్కింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios