Asianet News TeluguAsianet News Telugu

Omicron: బీ అలర్ట్.. సాధారణ జలుబు కాదు.. తేలిగ్గా తీసుకోవద్దు

భారత్ లో  కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Varient) వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా కేసుల‌తో బాధితుల సంఖ్య‌ 5,488కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ  2, 162 మంది వేరియంట్ నుంచి కోలుకున్నారు. ఈ క్ర‌మంలో నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ సాధారణ జలుబు కాదని, ఓమిక్రాన్ ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు.
 

NITI Aayog's VK Paul warns  Omicron is not common cold
Author
Hyderabad, First Published Jan 13, 2022, 1:07 PM IST

ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Varient) వణికిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్  వేరియంట్ కలవరం రేపుతోంది. దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ  2, 162 మంది వేరియంట్ నుంచి కోలుకున్నారు. దేశంలో 27 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1367 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ(Telangana)లో 260, ఏపీ(Andhra Pradesh)లో 61 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయ్యాయి. 

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ “సాధారణ జలుబు కాదని, ఓమిక్రాన్ ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. ఓమిక్రాన్ జలుబు సాధారణ జలుబు కాదు, త‌ప్ప‌ని స‌రిగా.. వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌నీ, మాస్క్ ధ‌రించాల‌ని హెచ్చ‌రించారు. ఇది సమాజం యొక్క బాధ్యత అని పాల్ పేర్కొంది. ప్ర‌తి ఒక్క‌రూ.. మాస్క్ పెట్టుకోవాల‌ని, టీకాలు వేసుకుందాం, వ్యాక్సిన్‌లు కొంత వరకు సహాయ పడుతోంద‌ని చెప్పాడు. ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ  వీకే పాల్ హెచ్చరించారు.

వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో జరిగినందునే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గినట్లు వివరించారు. భారత్ కోవిడ్-19ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇంకా వ్యాక్సిన్లు తీసుకోనివారు.. తక్షణం తీసుకోవాలని కోరారు. హోం ఐసొలేషన్‌లో మందుల అధిక వినియోగం, దుర్వినియోగం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు.

అంతకుముందు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కూడా  ఓమిక్రాన్ వేరియంట్ గురించి మాట్లాడుతూ..  ఈ వేరియంట్  "మైల్డ్ అని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే Omicron తక్కువ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాలని హెచ్చ‌రించారు WHO చీఫ్.  

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. లాబొరేటరీ ధృవీకరించబడిన కేసుల అన్ని హై-రిస్క్ ఉంద‌నీ,  రోగ లక్షణాలున్న వ్యక్తులను కోవిడ్ -19 కోసం పరీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. లక్షణరహిత వ్యక్తులు అధిక ప్రమాదంలో ఉంటే తప్ప పరీక్షించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోనివారికి ఒమిక్రాన్ గండం.. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబై(Mumbai) ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్‌లో చికిత్స పొందుతున్న 1900 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 96 శాతం మంది కనీసం తొలి విడత వ్యాక్సిన్ కూడా తీసుకోని వారే ఉన్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ ఛహల్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంగా తేటతెల్లంచేస్తున్నట్లు వివరించారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. మ‌రోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతోంది. గ‌త వారం రోజులుగా.. ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదవుతోన్నాయి.  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం తాజాగా.. భారత్ లో 1,94,720  కరోనావైరస్ కేసులు, 442 మరణాలు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios