Asianet News TeluguAsianet News Telugu

ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్..

ఫోర్బ్స్ మేగజైన్ ప్రతీ ఏటా విడుదల చేసే శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి స్థానం దక్కింది. జాబితాలో స్థానం దక్కినవారిలో సీతారామన్‌తో పాటు భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ మల్హోత్రా,బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా ఉన్నారు. 

Nirmala Sitharaman, Kiran Mazumdar-Shaw in Forbes 2020 list of 100 most powerful women - bsb
Author
Hyderabad, First Published Dec 9, 2020, 12:06 PM IST

ఫోర్బ్స్ మేగజైన్ ప్రతీ ఏటా విడుదల చేసే శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి స్థానం దక్కింది. జాబితాలో స్థానం దక్కినవారిలో సీతారామన్‌తో పాటు భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ మల్హోత్రా,బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా ఉన్నారు. 

జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్దే, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా ఈ జాబితాలో 29వ స్థానం దక్కించుకున్నారు.

కాగా,ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ 34వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌లో సీతారామన్ చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. తాజా జాబితాపై ఫోర్బ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ.. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు అనేక కీలక రంగాల్లో రాణించారని అన్నారు. ప్రభుత్వం, వ్యాపారం, సమాజోద్దరణ,మీడియా వంటి రంగాల్లో నాయకత్వ స్థానాల్లోకి ఎదిగొచ్చారని చెప్పారు.

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూ ఇందులో చోటు లభించింది. ఇక ఐరోపా కేంద్ర బ్యాంకు చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 

10 దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, 38 కంపెనీల సీఈవోలు, వినోదరంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులనూ ఈ జాబితాకు ఎంపిక చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios