నిర్మలా సీతారామన్: వయస్సు, బాల్యం, విద్య, జీవిత చరిత్ర, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

Nirmala Sitharaman:ఉన్నత చదువులు చవి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నిర్మలా సీతారామన్ భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ రక్షణ మంత్రిగా నియమితులైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అలాగే అత్యధికంగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు . ఇలా ఎన్నో ఘనతలు సాధించిన తెలుగింటి కోడలు సీతారామన్ గురించి తెలుసుకుందాం.  

Nirmala Sitharaman Biography, Family, Education, Political Career, Finance Minister of India KRJ

Nirmala Sitharaman Biography:  ఉన్నత చదువులు చవి, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నిర్మలా సీతారామన్ భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ రక్షణ మంత్రిగా నియమితులైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అలాగే అత్యధికంగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు . ఇలా ఎన్నో ఘనతలు సాధించిన తెలుగింటి కోడలు సీతారామన్ గురించి తెలుసుకుందాం.  

వ్యక్తిగత జీవితం, కుటుంబం , విద్య

దేశ మహిళ రక్షణ మంత్రిగా, మహిళ ఆర్థిక మంత్రిగా నియమితులైన చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో లో జన్మించారు. నిర్మల పాఠశాల విద్యను మద్రాసు, తిరుచిరాపల్లిలో పూర్తి చేశారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు.

Nirmala Sitharaman Biography, Family, Education, Political Career, Finance Minister of India KRJ

1984లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU)నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, M.Phil పూర్తి చేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లారు. జేఎన్‌యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్‌ తన భర్త పరకాల ప్రభాకర్‌ను కలిశారు. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఈ జంట 1986 సంవత్సరంలో పెద్దలను ఒప్పించిన ప్రేమ వివాహం చేసుకున్నారు . వీరికి ఓ కుమార్తె (వంగ్మాయి). 

అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ కు వెళ్లిన నిర్మలా సీతారామన్ .. అక్కడ పర్ట్ టైమ్ గా హాబిటాట్ లో సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తరువాత కొంత కాలం ఆమె అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ (UK)లోని ఆర్థికవేత్తకు సహాయకురాలుగా పనిచేశారు. ఆమె PWC (ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్), BBC వరల్డ్ సర్వీస్‌లో సీనియర్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి విభాగం)గా కూడా పనిచేశారు.

Nirmala Sitharaman Biography, Family, Education, Political Career, Finance Minister of India KRJ

రాజకీయ జీవితం

అనంతరం భారత్ కు వచ్చిన ఆమె 2003 నుండి 2005 మధ్యకాలంలో జాతీయ  మహిళా కమిషన్‌లో కూడా సభ్యురాలిగా కూడా సేవలందించారు. ఈ సమయంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితురాలైన నిర్మల 2006లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అనతికాలంలో అంటే.. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ వాణిని బలంగా వినిపించారు. ఇలా 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోనే ఆరుగురు బిజెపి అధికార ప్రతినిధుల బృందంలో ఆమె కూడా కీలక నేతగా స్థానం సంపాదించుకున్నారు.

2014లో బీజేపీ తరుపున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సీతారామన్.. నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో  జూనియర్ మంత్రిగా నియమితులయ్యారు. మే 2016లో రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేయుచున్న నిర్మల సీతారామన్ మూడేళ్లలోనే కీలకమైన రక్షణశాఖ మంత్రిగా నియమించబడ్డారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెప్టెంబర్ 3, 2017న అత్యంత కీలకమైన రక్షణ శాఖ నిర్మల సీతారామన్ దక్కింది. ఇలా రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ గా నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించారు. 

Nirmala Sitharaman Biography, Family, Education, Political Career, Finance Minister of India KRJ

గతంలో 1975, 1980 నుంచి 1982 వరకు రెండుసార్లు ఇందిరా గాంధీ భారత రక్షణ మంత్రిగా వ్యవహరించారు. అప్పటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ రాజీనామా చేయడంతో రక్షణ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్, కొంతకాలం చూస్తూ వచ్చారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఆయనకే రక్షణ శాఖ బాధితులు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ బాధ్యతలను నిర్మలమ్మకు అప్పగించారు. రక్షణ మంత్రిగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు నిర్మలమ్మ. సర్జికల్ స్ట్రైక్ జరగడంలో నిర్మల సీతారామన్ కీలకపాత్ర పోషించారు. అనంతరం మోడీ రెండోసారి ప్రధానిగా బాధితులు చేపట్టగా సీతారామన్ మరోసారి భారతదేశ మొట్టమొదటి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా మరొక రికార్డు సాధించారు.

గుర్తింపులు

1- నిర్మలా సీతారామన్‌కు 2019లో జెఎన్‌యు విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును ప్రదానం చేసింది.

2- ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా 2019లో ఆమె ప్రపంచంలోని 34వ అత్యంత శక్తివంతమైన మహిళగా ర్యాంక్ పొందారు.

తమిళ కుటుంబంలో పుట్టి తొలగింటి కోడలైన నిర్మల సీతారామన్ ఉన్నత విద్యను అభ్యసించడం ఏకాక ఉన్నత ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత దేశ రక్షణ మంత్రిగా నియమితులైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అలాగే తొలి మహిళ ఆర్థిక మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన నిర్మల సీతారామన్ మరింత ఉన్నతంగా రాణించాలని కోరుకుందాం.. ఆమె దేశంలోని మహిళలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios