మద్యం మత్తులో వావివరసలు మరిచిన ఇద్దరు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. తనకు చెల్లి వరసయ్యే యువతిపై ఓ కామాంధుడు కన్నేసి ఆమె భర్త సాయంతోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త కూడా అతడితో కలిసి కట్టుకున్న భార్యపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది మొదటిరాత్రి రోజే జరగడం మరీ దారుణం. 

ఈ  అఘాయిత్యం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్ కు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఈ మద్యే వివాహమైంది. పెళ్లి అనంతరం నవదంపతులకు వరుడి  ఇంట్లోనే కుటుంబ సభ్యులు శోభనం  ఏర్పాట్లుచేశారు. 

అయితే వరుడి బావ వరసయ్యే ఓ వ్యక్తి వదువుపై కన్నేశాడు. దీంతో మొదటిరాత్రి రోజు బామ్మరిదికి ఫుల్లుగా మద్యం తాపించి తన కోరికను తెలిపాడు. మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన అతడు కూడా అందుకు ఒప్పుకున్నాడు. దీంతో వీరిద్దరు కలిసి శోభనం గదిలోకి వెళ్లి వదువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆమెపై బౌతిక దాడికి కూడా పాల్పడ్డారు. 

 రాత్రంతా ఆ కామాంధుల చేతిలో నలిగిపోయిన యువతి ఉదయం తన పుట్టింటివారికి జరిగిన అఘాయిత్యం గురించి సమాచారం అందించింది. దీంతో వారు ఆమెను తీసుకెళ్లి స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని వైద్య  పరీక్షల  నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఫిర్యాదులో పేర్కొన్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.