పోలీసుల బూట్ల కింద నలిగి 4 రోజుల నవజాత శిశువు మృతి.. దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి..
పోలీసుల బూట్ల కింద నలిగి నాలుగు రోజుల శిశువు మృతి చెందిన ఘటన మీద ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు.
ఝార్ఖండ్ : ఝార్ఖండ్లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాల్ని కలిచి వేసింది. నాలుగు రోజుల ఓ నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగి చనిపోయిన హృదయ విదారక ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది. గిరిడీహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం తెల్లవారుజామున ఆ శిశువు తాతతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేయడానికి ఐదుగురు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ పోలీసులకు వారికి మధ్య జరిగిన పెనుగులాటలో శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయింది.
ఈ మేరకు ప్రాథమిక విచారణలో బయట పడింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసు అధికారులు స్టేషన్ ఇన్చార్జితో పాటు, మొత్తం ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. ఈ ఘటన మీద పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అయ్యో.. తల్లిపాలు గొంతులో ఇరుక్కుని నవజాతశిశువు మృతి.. తట్టుకోలేక ఆ మాతృమూర్తి చేసిన పని...
బుధవారం జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో ఒక నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిచనిపోయిన కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు. డియోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోషోడింఘి గ్రామంలో ఒక కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.
"కోర్టు జారీ చేసిన రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడు నాలుగు రోజుల బాలుడు చనిపోయాడని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమికంగా, శిశువు శరీరంపై బాహ్య గాయాలు కనుగొనబడలేదు. పోస్ట్‌మార్టం కోసం శిశువును తరలించించాం' అని గిరిడిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ, అసలు ఏం జరిగిందో చెప్పలేం అని ఎస్పీ తెలిపారు.
సరైన వీడియోగ్రఫీతో మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో వైద్యుల బృందం శవపరీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఏ పోలీసు పసికందును తొక్కినట్లుగా మా వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఆరోపణ నిజమని తేలితే తప్పుచేసిన సిబ్బందిని వదిలిపెట్టబోమని రేణు అన్నారు. చనిపోయిన శిశువు తాత భూషణ్ పాండే, మరొక వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయడానికి నలుగురైదుగురు పోలీసులు వెళ్లారని ఎస్పీ చెప్పారు.
తెల్లవారుజామున 3.20 గంటలకు పోలీసు సిబ్బంది తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ భూషణ్ పాండే అనే వ్యక్తి ఆరోపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. "పోలీసులను చూసి నేను పారిపోయాను, ఇంట్లో ఉన్న మహిళలు కూడా బయటకు పరుగెత్తారు. నాలుగు రోజుల చిన్నారి అక్కడ నిద్రిస్తుంది. పోలీసులు ఇంట్టలో వెతకడం ప్రారంభించారు. శిశువును తొక్కి చంపారు" అని వీడియోలోని వ్యక్తి పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, మార్చి 6న ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో చూస్తూ దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేయడం.. నాటు తుపాకుల తయారీ.. ఆత్మహత్యలు చేసుకోవడం.. ఇలా ఎన్నో రకాల విధ్వంసకరమైన విషయాలకు..యూట్యూబ్ ను వాడుతుండడం చూస్తూ ఉన్నాం. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ లో 15 ఏళ్ల బాలిక ఇలాంటి మరో దారుణానికి ఒడికట్టింది. యూట్యూబ్లో చూస్తూ పురుడు పోసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను అతికర్కశంగా గొంతు నులిమి చంపేసింది.
ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ స్థానిక అంబుజారి ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన బాలికకు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఆ తరువాత అతనికి ఆమె లైంగికంగా దగ్గర అయింది. దీంతో బాలికకు గర్భం వచ్చింది. అయితే వ్యక్తితో పరిచయం, అతనితో శారీరక సంబంధం… గర్భం రావడం లాంటి విషయాలు ఆమె తల్లిదండ్రులకు తెలియదు. బాలిక చెప్పలేదు. ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందనుకుందో ఏమో తెలియదు కానీ కుటుంబ సభ్యులకు తెలపలేదు.