Asianet News TeluguAsianet News Telugu

న‌యా సైబ‌ర్ స్కామ్.. మిస్డ్ కాల్ వ‌చ్చింది.. బ్యాంక్ అకౌంట్ నుంచి ల‌క్ష‌లు పోయాయి

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అహ్మదాాబాద్ కు చెందిన ఓ వ్మాపారి కొత్త సైబర్ మోసం బారిన పడ్డాడు. దీంతో అతడికి తెలియకుండానే అకౌంట్ నుంచి లక్షలు మాయమయ్యాయి. 

New cyber scam .. Missed call received .. Lakhs lost from bank account
Author
Ahmedabad, First Published Jan 8, 2022, 5:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టెక్నాల‌జీ పెరుగుతోంది. పెరుగుతున్న టెక్నాల‌జీతో పాటు మోసాలు పెరుగుతున్నాయి. అమాయ‌కులైన  ప్ర‌జ‌ల‌ను ఆస‌రాగా చేసుకునే ఈ మోసాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌తీ రోజు ప‌దుల సంఖ్య‌లో ఇలాంటి కేసులు పోలీసు స్టేష‌న్ లో న‌మోద‌వుతున్నాయి. అయితే ఈ సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో చ‌దువురాని వారే ప‌డుతున్నారంటే పొర‌పాటే. ఉన్న‌త విద్యలు చ‌దువుకొని, టెక్నాల‌జీ తెలిసిన వారు కూడా ఈ సైబ‌ర్ మోసాల‌కు గుర‌వుతున్నారు. 

ఇదో కొత్త ర‌కం మోసం...
‘‘సార్..  మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది. మీ కార్డు వివరాలు చెప్తే మీ కార్డును తిరిగి అన్ బ్లాక్ చేస్తాం. అలాగే మీకు ఒక మెసేజ్ వ‌స్తుంది. అందులో ఉన్న‌ నెంబ‌ర్ మాకు చెప్పాల్సి ఉంటుంది.’’ అని తరచూ ప్రజలకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తుంటారు. నిజంగా బ్యాంక్ అధికారులే కాల్ చేస్తున్నారనుకొని వారు అడిగిన వివరాలు అన్నీ చెప్తే.. అకౌంట్ నుంచి డ‌బ్బులు మాయం అవ‌డం ఖాయం. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది అమాయ‌కులు మోస‌పోయారు. ‘‘ సార్ మీకు లాటరీ వచ్చింది. అయితే వాటిని మీ అకౌంట్లో వేయాలంటే ఇండియన్ రూల్స్ ఒప్పుకోవడం లేదు. దీని కోసం మీరు కొంత అమౌంట్ చెల్లిస్తే, ఆ నిబంధ‌న‌ల‌కు అనుమ‌తి ల‌భిస్తాయి.’’ అంటూ కాల్స్ వస్తాయి. వీటిని నమ్మిన చాలా మంది నిజమే అనుకొని వారు అడిగిన డబ్బుల్నీ వారికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. డబ్బులు పంపిన తరువాత వారికి కాల్ చేస్తే కలవదు. లాటరీ రాదు. 

ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తీ రోజు మ‌నం పేప‌ర్ల‌ల‌లో చ‌దువుతుంటాం. ఇలా టెక్నాలజీల పెరిగిన కొద్ది మోసం చేసే విధానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మ‌నం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఒక కొత్త‌ర‌క‌మైన మోసం. ఇలాంటి సైబ‌ర్ మోసం ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. కేవలం ఒక్క మిస్డ్ కాల్ రావ‌డంతో ఓ వ్య‌క్తి ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు. అస‌లేం జ‌రిగిందో తెలుసుకునేలోపే రూ. 46 ల‌క్ష‌లు అత‌డి అకౌంట్ నుంచి మాయ‌మ‌య్యాయి. దీంతో ఒక్క సారిగా షాక్ గురైన బాధితుడు వెంట‌నే పోలీసుల‌ను సంప్ర‌దించాడు. ఈ ఘ‌ట‌న అహ్మ‌దాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చింది. 

అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో ఉండే రాకేష్ షా వ్యాపారం నిర్వ‌హిస్తుంటాడు. అత‌డు త‌న ప‌నిలో ఉండ‌గా ఒక రోజు మిస్డ్ కాల్ వ‌చ్చింది. అది కొత్త నెంబ‌ర్. ఎవ‌రో అనుకోకుండా కాల్ చేసి క‌ట్ చేసి ఉంటార‌ని భావించాడు. కొంత స‌మ‌యం తరువాత ఆ సెల్ ఫోన్ సిగ్న‌ల్స్ పోయాయి. సిమ్ కార్డులు ప‌ని చేయ‌డం ఆగిపోయాయి. దీంతో అత‌డు క‌ష్ట‌మ‌ర్ కేర్ కు ఫోన్ చేశాడు. ఫిర్యాదు స్వీక‌రించిన కాల్ సెంట‌ర్ ప్ర‌తినిధులు కొంత స‌మ‌యం త‌రువాత సిమ్‌లు ప‌ని చేస్తాయ‌ని తెలిపారు. అయితే అదే రోజు రాత్రి అత‌డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మ‌ళ్లీ క‌ష్ట‌మ‌ర్ కేర్ కాల్ కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. పొద్దున మ‌ళ్లీ అలాగే జ‌రిగింది. దీంతో నెట్ వ‌ర్క్ ఆఫీసుకే వెళ్లాడు. దీంతో అత‌డి సిమ్ కార్డులు కోల్ క‌త్తాలో ఎవ‌రో బ్లాక్ చేసిన‌ట్టు తెలిపారు. అత‌డికి అనుమానం వ‌చ్చి బ్యాంకు కు వెళ్లి లావాదేవీలు ప‌రిశీలించాడు. అత‌డు అనుకున్న‌దే నిజం అయ్యింది. రూ. 46 ల‌క్షలు అకౌంట్ నుంచి మాయ‌మ‌య్యాయ‌ని గుర్తించాడు. దీంతో బాధితుడు వెంట‌నే  సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios