కొత్త జంట వేదికపైనే దెబ్బలాడుకున్నారు. అందరూ చూస్తుండగానే కెమెరాల ఎదుట ఒకరి చెంపలను మరొకరు చెల్లుమనిపించారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లిళ్ల సీజన్ జోరందుకుంది. ఎక్కడ చూసినా పెళ్లిళ్ల హడావిడి కనిపిస్తోంది. మన దేశంలో ప్రాంతాలను, వారి సంస్కృతిని బట్టి వివాహాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఆ వివాహాలకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చినప్పుడు చాలా కొత్తగా చూస్తాం. ఓహో.. ఇలా కూడా పెళ్లిళ్లు జరుగుతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. వీటికి సంబంధించి కొన్ని ఫన్నీ వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. అదేదో కొత్త సంప్రదాయానికి సంబంధించిన పెళ్లి అనుకుంటే మీరు పొరపడినట్టే.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ?
ఓ జంటకు అప్పుడే పెళ్లి అయ్యింది. అయితే ఆ వివాహ కార్యక్రమంలో భాగంగా వేదికపై కొత్త దంపతులు ఒకరినొకరు స్వీట్స్ తినిపించుకోవాలి. అక్కడ అదే తంతు కొనసాగుతోంది. పెళ్లి కూతురు స్వీట్ తీసుకొని వరుడు నోట్లో పెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే పెళ్లి కొడుకు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. ఆమె వైపు అస్సలు చూడటం లేదు. అతడి దృష్టి అంతా ఆ కెమెరాల వైపే ఉంది. దీంతో ఓ వధువుకు ఓపిక నశించింది. తన చేతిలో ఉన్న స్వీట్ తోనే వరుడు ఫేస్ పై కొడుతుంది.
ఊహించని ఈ పరిణామానికి వరుడు షాక్ అవుతాడు. అతడు కోపంతో ఆమె చెంప చెల్లుమనిపిస్తాడు. వరుడు చేసిన పనికి వధువుకు కూడా కోపం వస్తుంది. ఆమె కూడా తగ్గకుండా భర్త చెంప వాయిస్తుంది. దీంతో పెళ్లి కొడుకు కూడా మళ్లీ ఆమెను కొడుతాడు. ఇలా రెండు, మూడు సార్లు జరుగుతుంది. ఆ వీడియో అక్కడితో ఆగిపోతోంది. ఈ కొత్త జంట ఇలా వేధికపై ఒకరినొకరు కొట్టుకుంటున్నా అక్కడ ఉన్నవారెవరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కొద్ది రోజుల్లోనే 3.8 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. 4 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ‘‘మొదటి రాత్రికి ముందు మొదటి పోరాటం’’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘‘ఓమ్...తపడ్ పే థాపడ్’’ అని మరొకరు రాసుకొచ్చారు. కాగా సునీల్ గ్రోవర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వీడియో నిజమైన పెళ్లిలోది కాదని తేలింది. ఇది యూట్యూబ్‌లోని పేరడీ వీడియో నుండి ఎడిట్ చేసిన క్లిప్ అని చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.