కన్ను ఎవరు బాగా కొట్టారు..?

netizens comments on rahul gandhi compared with priya prakash variar
Highlights

‘ఈ వయసులో నాకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఎందుకు రాహుల్‌?’

పార్లమెంట్ లో శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీరియస్ ప్రసంగం తర్వాత..ప్రధాని మోదీని హగ్ చేసుకొని ఆ తర్వాత కన్నుకొట్టాడు. అంతే మోదీ సహా అందరూ షాక్ అయ్యారు. కాగా.. రాహుల్ గాంధీ చేసిన పనికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. రాహుల్ కన్నుకొట్టడాన్ని.. మళయాళీ బామ ప్రియా ప్రకాశ్ వారియర్ తో పోలుస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల కామెంట్లలో కొన్ని ఆసక్తికరమైనవి...
‘జులై 20ని అంతర్జాతీయ ఆలింగన దినోత్సవంగా యునెస్కో ప్రకటిస్తుంది.’

* ‘గొప్ప ప్రసంగం..గొప్ప ఆలింగనం.. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రాన్ని రాహుల్‌ మళ్లీ గుర్తు చేశారు.’

* మోదీ: అంతేనా!

రాహుల్‌: ఇంకేం కావాలి!

మోదీ: కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు..

* రాహుల్‌తో మోదీ: ‘ఈ వయసులో నాకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఎందుకు రాహుల్‌?’

* వీడియో ఆఫ్‌ ది డికేడ్‌!

* ‘ప్రధాని అయ్యాక విదేశీ నేతలను ఎలా ఆలింగనం చేసుకోవాలో మోదీ వద్ద ఇప్పటినుంచే రాహుల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.’

* ‘రాహుల్‌.. మోదీని హగ్‌ చేసుకోమని నీకు ముందే రాసిచ్చిన స్క్రిప్ట్‌లో ఉందా? అచ్చం అలాగే చేశావా?’ అంటూ ఇంకొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

వాహ్‌ రాహుల్‌... ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌’

* ‘ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను బాగా ఫాలో అవుతున్నావా రాహుల్‌ జీ.. ఆమె కన్నుకొట్టిన వీడియోమరిన్ని సార్లు చూడండి.ఇంకా ఇంప్రూవ్‌ అవుతారు.’

* ‘రాహుల్‌ ప్రియా ప్రకాశ్‌ కంటే గొప్పగా కన్నుకొట్టగలరు. మున్నాభాయ్‌ కంటే ఇంకా గొప్పగా ఆలింగనం చేసుకోగలరు. ఇక ఆయనకేమీ రాదని ఎలా చెప్తాం?’

* ‘రాహుల్‌ మాట్లాడేదంతా నిజం కాదని ఆయన మరోసారి నిరూపించారు.’

* ‘రాహుల్‌... మోదీని ఆలింగనం చేసుకున్నారు. మీ పార్టీ నేతలకు కన్ను కొట్టారు. తర్వాత ఎవర్ని ఏంచేస్తారో?’

* ‘సోనియాజీ..రాహుల్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన బహిరంగ ప్రదేశాల్లో కన్నుకొడుతున్నారు.’

* ‘ప్రియా ప్రకాశ్‌ వీడియోలు చూపించి రాహుల్‌ని దివ్యస్పందన బాగా తీర్చిదిద్దింది. ఆమె కష్టానికి ప్రతిఫలం ఈరోజు పార్లమెంట్‌లో కనిపించింది.’

* ‘రాహుల్‌ వర్సెస్‌ ప్రియా ప్రకాశ్‌.. ఇద్దరిలో ఎవరు బాగా కన్నుకొట్టారు?’

 

loader