నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. NEET PG exam 2022 వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. NEET PG exam 2022 వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ ఎగ్జామ్ మార్చి 12న జరగాల్సి ఉంది. మరోవైపు నీట్ 2022 నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఈలోపే నీట్ వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ 2022 పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS).. NEET PG exam నిర్వహిస్తుంది. ఈ ఏడాది మార్చి 12న పరీక్షను నిర్వహించాలని NBEMS నిర్ణయించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని NBEMSకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆరుగురు MBBS వైద్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిబంధనలలో నిర్దేశించిన ఇంటర్న్‌షిప్ పీరియడ్ పూర్తి చేయడం వంటి అనేక పూర్తి చేయడానికి అనువుగా పరీక్షను వాయిదా వేయాలని కోరారు.
ఇంటర్న్‌షిప్ పీరియడ్‌ను పూర్తి చేయలేకపోయినందున పరీక్ష రాయలేమని విద్యార్ధులు తెలిపారు. అనేక వందల మంది MBBS గ్రాడ్యుయేట్లకు కోవిడ్ విధుల కారణంగా ఇంటర్న్‌షిప్ ఆగిపోయిందని చెప్పారు. ఇంటర్న్‌షిప్ డ్యూటీ లేకపోవడం వల్ల వైద్యులు తమ తప్పు లేకుండానే పరీక్షకు హాజరు కావడానికి అనర్హులుగా మారే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్‌షిప్ డెడ్‌లైన్‌ను పొడగించాలని కూడా వారు కోరుతున్నారు.
