కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. రాహుల్ గాంధీకి ఈ నోటీసులు జారీ చేశారు.

పార్లమెంట్ లో రఫెల్ ఒప్పందంపై నిర్మలా సీతారమన్ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తనను తాను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారంటూ.. నిర్మలా సీతారామన్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘56 అంగులాల చాతిగల ఓ వ్యాచ్ మెన్ పారిపోయి ఓ మహిళకు చెప్పాడు.. సీతారామన్ జీ నన్ను కాపాడండి. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగాడు. రెండున్నర గంటలపాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను. యస్ ఆర్ నో చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేకపోయారు’ అంటూ మోదీ, నిర్మలా సీతారామన్ పై రాహుల్ కామెంట్స్ చేశారు.

కాగా.. మహిళలను గౌరవించడం లేదంటూ.. జాతీయ కమిషన్ రాహుల్ గాంధీని తప్పుబట్టింది. తన వ్యాఖ్యలను రాహుల్ వెనక్కి తీసుకోవాలని.. కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.