పంజాబ్‌లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయ భేదాలు బయటపడ్డాయి. సిద్దూ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయి. పార్టీలో తలెత్తిన ఈ విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ ను మంగళవారం నవజ్యోత్ సింగ్ సిద్దూ కలిశారు. కాంగ్రెస్ ప్యానెల్‌ను మంగళవారం సిద్దూ కలిశారు.

ఈ క్రమంలోనే నవజ్యోత్ సింగ్ సిద్దూ కనిపించడంలేదంటూ.. ఆచూకీ తెలిపిన వారికి రూ50వేల క్యాష్ ప్రైజ్ అంటూ అమృత్ సర్ లో పోస్టర్లు కూడా వెలిశాయి.
నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇచ్చిన హామీలన్నింటినీ మరిచిపోయాడని ఆరోపిస్తూ ఒక ఎన్జీఓ పోస్టర్లు వేసింది. సిద్ధూ తన నియోజకవర్గాన్ని చాలా కాలంగా సందర్శించలేదని ఆ పోస్టర్లలో ఎన్జీఓ పేర్కొంది.
అయితే ఇలా సిద్దూ కనిపించడం లేదంటూ ఆయన నియోజకవర్గంలో పోస్టర్లు వెలియడం ఇది మొదటిసారేం కాదు. మీడియా కథనాల ప్రకారం జూలై 2019లో శిరోమణి అకాలీదళ్ నాయకులలో ఒకరు ఇలాంటి పోస్టర్లు వేశారు. దీంతోపాటు2009 లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధు తప్పిపోయాడంటూ పోస్టర్లు వేశారు.
ఇంతకీ సిద్ధూ-అమరీందర్ సింగ్ ల మధ్య వివాదం ఏమిటీ?? అంటే...కోట్కాపురా కాల్పుల కేసు దర్యాప్తును పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేయడంతో సిద్దూ, అమరీందర్ సింగ్ పై విమర్శలు గుప్పించారు. అప్పటి నుండి కాంగ్రెస్‌లో గొడవ ప్రారంభమైంది. కోర్టులో ఈ కేసును న్యాయవాదులు సరిగా ప్రజెంట్ చేయలేదని కాంగ్రెస్ లో ఓ వర్గం చెబుతోంది. కోట్కాపురా కాల్పుల కేసులో కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సిద్ధు మొదటిసారి ప్రశ్నించాడు. అప్పటి నుండి వివాదం ప్రారంభమైంది.