Asianet News Telugu

మరదలిపై వాంఛ.. భార్య, పిల్లలతో సహా 5మంది హత్య, మృతదేహంతో శృంగారం.. చివరికి..

నాగ్ పూర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. 36యేళ్ల ఓ వ్యక్తి అత్తా, మరదలి గొంతు కోసి హత్య చేసి.. అనంతరం భార్య, ఇద్దరు పిల్లల గొంతులు కోసి హత్యచేశాడు. ఆ తరువాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Nagpur : Possessive of unmarried sister-in-law, man kills her, wife, 2 children, mom-in-law before ending life - bsb
Author
Hyderabad, First Published Jun 23, 2021, 11:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నాగ్ పూర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. 36యేళ్ల ఓ వ్యక్తి అత్తా, మరదలి గొంతు కోసి హత్య చేసి.. అనంతరం భార్య, ఇద్దరు పిల్లల గొంతులు కోసి హత్యచేశాడు. ఆ తరువాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండు వేర్వేరు ఇళ్లలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోలిబార్ చౌక్ సమీపంలోని బాదల్ కా అఖాడా ప్రాంతంలో ఆదివారం రాత్రి జరగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 

నిందితుడు అలోక్ మాతుర్కర్ మామ.. దేవీదాస్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. తాగుడు అలవాటు ఉంది. ఆదివారం రాత్రి కూడా తాగేవచ్చాడు. ఇంటికి వచ్చినా అతను భార్య, కూతురు పడుకున్నారనుకున్నాడు. 

తనతో తెచ్చిన మామిడిపండ్లను తన మరో కూతురికి ఇద్దామని అల్లుడి ఇంటికి వెళ్లాడు. అయితే ఇరుగు, పొరుగు వారు మాత్రం కిటికీల్లోనుంచి మరదలు, అత్త మృతదేహాలను గమనించారు. కాగా అల్లుడు అలోక్ మాతుర్కర్ ఇంటికి వెళ్లిన మామ అక్కడి దృశ్యం చూసి స్పృహలోకి వచ్చాడు. దీంతో మొత్తం సంఘటన వెలుగులోకి వచ్చింది. 

మాతుర్కర్ తన భార్య విజయను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు. సాహిల్ (10), కుమార్తె పారి(14) ఉన్నారు. విజయ చెల్లెలు అమీషా బొబ్డే (20) కొంతకాలం క్రితం మాతుర్కర్ కు టైలరింగ్ పనిలో సహాయం చేసేది. అయితే మూడు నెలల క్రితం ఈ పని మానేసింది. 

తను వేరేవాళ్లతో మాట్లాడితే మాతుర్కర్ వేధించడం మొదలుపెట్టాడని తరువాత తెలిసింది. అంతేకాదు ఆమె తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడినందుకు మాతుర్కర్ కొట్టాడని ఫిర్యాదు చేస్తూ అమిషా ఏప్రిల్‌లో తహసీల్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు చేసింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాతుర్కర్‌ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. 

ఆదివారం రాత్రి కూడా అమిషా, అక్క విజయ, మాతుర్కర్ లతో ఈ విషయంలో గొడవ జరిగిందని, ఆ తరువాతే హత్యలు జరిగాయని భావిస్తున్నారు. దీని తరువాత, మాతుర్కర్ ఆదివారం అర్ధరాత్రి కంటే ముందే వీరిని చంపి.. ఆ తరువాత మృతదేహాలతో గడిపిన తరువాత, ఉరి వేసుకున్నాడని అనుమానిస్తున్నారు.

మాతుర్కర్  భార్య మృతదేహానికి దగ్గర్లో సీలింగ్ ఫ్యాన్ ను ఉరివేసుకున్నాడు. విజయ మృతదేహం సగం నగ్నంగా ఉంది. ఆమెను గొంతుకోసం మంచం మీద పడేశాడు. మాతుర్కర్ కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని మంచం క్రిందకు నెట్టివేశాడు. కూతురు పారి శరీరం మాత్రమే చేతులు, కాళ్ళతో కట్టుబడి ఉంది. సాహిల్ ముందు గదిలోని సోఫాలో దిండుతో నొక్కి చంపినట్టుగా ఉన్నాడు. 

అయితే, హత్యలకు కొద్దిరోజుల క్రితమే ఆన్ లైన్ లో మాతుర్కర్ కత్తులు కొన్నాడు. దీంతో అతను ముందునుంచే హత్యలకు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకానీ క్షణికావేశంలో చేసింది కాదని తెలుస్తోంది. 

మాతుర్కర్ ఇంటికి 200 మీటర్ల దూరంలోని బొబ్డే ఇంట్లో.. అమిషా,  ఆమె తల్లి లక్ష్మీబాయి వేర్వేరు గదులలో గొంతు కోయబడి, మృతి చెంది కనిపించారు. అయితే అమిషాను చంపిన తరువాత మాతుర్కర్ అమిషా శరీరంతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిసింది, అమీషా మృతదేహం నగ్నంగా ఉంది. 

కెమికల్ అనలిస్టుల బృందం అమిషా శరీరంలో వీర్యాన్ని కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. అమిషా, ఆమె తల్లిని చంపడానికి ముందు మాతుర్కర్ చికెన్ కర్రీలో ఏవో మందులు కలిపాడనే దిశగా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత దారుణం జరుగుతుంటే ఇంటి పక్కన ఉన్నవాళ్లెవ్వరికీ వారి అరుపులు వినిపించలేదు. 

అంతేకాదు మాతుర్కర్ మొబైల్ ఫోన్ గ్యాలరీలో పోర్న్ క్లిప్‌లు,  బ్లాక్ మ్యాజిక్ వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే హత్యలకు ప్రత్యక్ష సాక్షులు లేనందున, హత్యలు జరిగిన తీరు గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే మాతుర్కర్ అత్తామామల ఇంటినుంచి తన అపార్ట్మెంట్ వైపు రావడాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. 

అంటే మాతుర్కర్ తన మరదలు, అత్తను చంపిన తరువాతే తన భార్య, పిల్లల్ని చంపాడని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు మాతుర్కర్ ఇంటితలుపులు లోపలినుంచి గడియవేసి ఉన్నాయి. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. 

ఒక వాదన ప్రకారం.. మాతుర్కర్ అత్తగారింట్లో అమిషాను ముందు చంపి, ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన అత్త లక్ష్మీబాయిని చంపేశాడు. ఆ తరువాతే తన ఇంటికి వచ్చి భార్య, పిల్లల్ని చంపాడని అంటుంటే.. మరో వాదన ప్రకారం.. ముందు భార్య,పిల్లల్ని చంపి.. ఆ తరువాతే అత్తగారింటికి వెళ్లి.. మరదలు, అత్తను చంపాడని.. ఆ తరువాత ఉరివేసుకోవడానికి తిరిగి తన ఇంటికి వచ్చాడని అంటున్నారు. 

అంతకుముందు అందరూ కలిసే ఉండేవారు. అయితే లాస్ట్ ఆగస్ట్ లోనే మాతుర్కర్ విడిగా ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని వెళ్లారని పక్కింటి వ్యక్తి చెబుతున్నాడు. మరదలు అమిషా, మాతుర్కర్ మీద కేసు పెట్టిన తరువాత ఇది జరిగింది. 

మాతుర్కర్ పిల్లలతో చాలాబాగా ఉండేవాడని, కొడుకుతో ఆడుకునేవాడని, కూతుర్ని ట్యూషన్ కి తీసుకువెళ్లి, తీసుకువచ్చేవాడని ఇరుగుపొరుగు వాళ్లు చెబుతున్నారు. 

పక్కింటివారు ముందు సాహిల్ మృతదేహాన్ని గమనించి.. నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేశారు. కానీ స్పందన లేదు. అలాగే అత్తింటి పొరుగువారు తలుపులు తీసి ఉండడంతో అమీషాను పిలిచారు. కానీ రెస్సాన్స్ లేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు తహసీల్ పోలీసులను అప్రమత్తం చేశారు. మృత చెందిన మాతుర్కర్‌ మీద పోలీసులు హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios