నాగ్‌పూర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

మరాఠా చరిత్రలోనూ , బ్రిటీష్ వారి పాలనలోనూ, స్వాతంత్ర పోరాటంలోనూ నాగ్‌పూర్ కీలకపాత్ర పోషించింది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నాగ్‌పూర్ కంచుకోటగా విలసిల్లుతోంది. అనసూయభాయ్ కాలే, మాధవ్ శ్రీహరి అనే, జాంబవంతరావు ధోతే, భన్వరీలాల్ పురోహిత్, విలాస్ ముత్తేమ్‌వార్, నితిన్ గడ్కరీ వంటి హేమాహేమీలు నాగ్‌పూర్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ 13 సార్లు, బీజేపీ మూడు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, నాగ్‌పూర్ సౌత్, నాగ్‌పూర్ ఈస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్, నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు.

Nagpur lok sabha elections result 2024 ksp

ఆరెంజ్ సిటీగా పేరొందిన నాగ్‌పూర్‌ .. మహారాష్ట్రలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. విదర్భ ప్రాంతంలో కీలక నగరంగా వెలుగొందుతున్న నాగ్‌పూర్.. మరాఠా రాజకీయాలకు, సంస్కృటి, సాంప్రదాయాలకు కేంద్రం. ఎంతోమంది ఉద్ధండులైన నేతలను దేశానికి అందించిన ఈ నగరం నేటికి తన విలక్షణతను చాటుకుంటోంది. మరాఠా చరిత్రలోనూ , బ్రిటీష్ వారి పాలనలోనూ, స్వాతంత్ర పోరాటంలోనూ నాగ్‌పూర్ కీలకపాత్ర పోషించింది.

1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నాగ్‌పూర్ కంచుకోటగా విలసిల్లుతోంది. అనసూయభాయ్ కాలే, మాధవ్ శ్రీహరి అనే, జాంబవంతరావు ధోతే, భన్వరీలాల్ పురోహిత్, విలాస్ ముత్తేమ్‌వార్, నితిన్ గడ్కరీ వంటి హేమాహేమీలు నాగ్‌పూర్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ప్రాంతంలో విస్తరించి వుంది. 

నాగ్‌పూర్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :

నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ 13 సార్లు, బీజేపీ మూడు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, నాగ్‌పూర్ సౌత్, నాగ్‌పూర్ ఈస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్, నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నాగపూర్ జిల్లా మొత్తం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 21,61,096 మంది.

2019లో 11,86,051 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 54.88 శాతం పోలింగ్ నమోదైంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగపూర్ లోక్‌సభ పరిధిలోని ఆరు శాసనసభ స్థానాల్లో బీజేపీ 4, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి నితిన్ గడ్కరీ 6,60,21 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి నానా ఫాల్గుణరావు పటోలేకు 4,4,212 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా నితిన్ గడ్కరీ 2,16,009 ఓట్ల మెజారిటీతో నాగ్‌పూర్‌లో విజయం సాధించారు. 

నాగ్‌పూర్ ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై గడ్కరీ కన్ను :

ఇక్కడ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని నితిన్ గడ్కరీ భావిస్తున్నారు. ప్రధాని మోడీ ఛరిష్మా, కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులు, కేంద్ర రవాణా శాఖ మంత్రిగా తాను తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌లను దృష్టిలో పెట్టుకుని తనకు మరోసారి విజయం ఖాయమని  నితిన్ గడ్కరీ భావిస్తున్నారు. అయితే తన ఒకప్పటి కంచుకోటను తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో సానుభూతి కలిసిస్తోందని హస్తం పార్టీ భావిస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios